Advertisementt

బాలయ్య కి ఝలక్ ఇచ్చిన రాజమౌళి

Wed 15th Dec 2021 05:46 PM
nbk unstoppable,balakrishna,rajamouli,balakrishna teases rajamouli,keeravani,unstoppable,aha ott,aha video,aha unstoppable  బాలయ్య కి ఝలక్ ఇచ్చిన రాజమౌళి
Balakrishna bombards Rajamouli బాలయ్య కి ఝలక్ ఇచ్చిన రాజమౌళి
Advertisement
Ads by CJ

ఆహ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ నిజంగానే అన్ స్టాపబుల్ రేంజ్ లో దూసుకుపోతుంది. బాలకృష్ణ అల్లరి, ఆయన స్టయిల్, అతిథులతో బాలయ్య ఆడించే గేమ్స్, గెస్ట్ లు వేసే పంచ్ లకు బాలయ్య ఎక్సప్రెషన్స్, ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై బాలయ్య వేసే డాన్స్ స్టెప్స్ అన్ని అన్ స్టాపబుల్ షో కి హైలైట్స్ గా నిలుస్తున్నాయి.. మంచు మోహన్ బాబు తో ఫస్ట్ ఎపిసోడ్ తోనే అదరగొట్టేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ పై అంచనాలు పెంచేశారు. ఈ షో కి వచ్చిన, వస్తున్న, రాబోయే గెస్ట్ లను చూస్తే నిజంగా అల్లు అరవింద్ పక్కా ప్లాన్ తోనే బాలకృష్ణ ని ఈ టాక్ షో కోసం దింపారని అర్ధమవుతుంది. హీరో నాని, బ్రహ్మి తో అన్ స్టాపబుల్ ఆడిన బాలకృష్ణ అఖండ టీం తో చేసిన రచ్చ అయితే చెప్పక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తోనూ, బోయపాటితోను బాలయ్య అదిరిపోయేలా ఆడేసాడు. 

ఇక అన్ స్టాపబుల్ ఎపిసోడ్ నెంబర్ 5 లో ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్, దర్శధీరుడు రాజమౌళితో పాటుగా సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొన్నారు. అయితే తాజాగా రాజమౌళి - బాలయ్య ల అన్ స్టాపబుల్ ప్రోమో వదిలారు. మరి పాన్ ఇండియా డైరెక్టర్ తో బాలకృష్ణ ఎలా అన్ స్టాపబుల్ అంటారో.. ఈ ప్రోమో ఎలా ఉంటుందో అనే అతృతతో ఉన్న ఫాన్స్ కి ప్రోమో రిలీజ్ చేసి సెలెబ్రేషన్న్ చేసుకోమన్నారు ఆహా యాజమాన్యం. ఇక చాలా రాయల్ గా అన్ స్టాపబుల్ షో కి రాజమౌళి ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య తన స్టయిల్లో మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని, అఛీవర్ అని అందరికి తెలుసు. మరి ఎందుకు ఈ తెల్లగెడ్డం అనగా.. రాజమౌళి తన గెడ్డాన్ని స్టయిల్ గా చేతితో రాసుకున్నారు. మళ్ళీ బాలయ్యే మన కాంబినేషన్ ఇంకా పడలేదు.. నిన్నో మొన్నో బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగారు.. దానికి మీ సమాధానం ఏమిటి అనగానే.. రాజమౌళి మీసాలు మెలేసారు. కానీ మాట్లాడలేదు.. 

మళ్ళీ బాలయ్యే మీతో సినిమా చేస్తే.. హీరోస్ కి ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత ఆ హీరోలకి రెండు మూడు సినిమాలు ఫసక్ కేగా అనగా.. దానికి రాజమౌళి తల వెనుక చెయ్యి పెట్టుకుని అసహనంగా రుద్దుకున్నారు. ఏమిటి సమాధానాలు చెప్పరేమిటి రాజమౌళి అనగానే నోరు విప్పిన రాజమౌళి.. మీకు తెలుసు, నాకు తెలుసు, చూసిన అందరికి ఇది ప్రోమో అని, సమాధానాలు ఎపిసోడ్ లో చెబుతా అని బాలయ్యకి ఝలక్ ఇచ్చారు.

Balakrishna bombards Rajamouli:

NBK Unstoppable 5: Balakrishna teases Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ