బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తి కాబోతుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో బిగ్ బాస్ స్టార్ మా కి ప్యాకప్ చెప్పేస్తుంది. సీజన్ మొదలైనప్పటినుండి చప్పగానే సాగిన.. బిగ్ బాస్ లో ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు, ఎవరు సీజన్ 5 ట్రోఫీ అందుకుని ప్రైజ్ మనీ గెలుస్తారో అనే దాని మీద బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ సన్నీ నే ఫైనల్ విన్నర్ అని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ పంచింది సన్నీనే అని.. అతనే విన్నర్ అంటున్నారు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి షణ్ముఖ్ కి ఆ ఛాన్స్ ఉంది. ఫాన్స్ ఓట్స్ తో షణ్ముఖ్ విన్నర్ అయినా అవ్వొచ్చు. కానీ హౌస్ లో ఎప్పుడూ సైలెంట్ గా, సిరిని కమెండ్ చేస్తూ.. తన జోన్ నుండి బయటికి రాకుండా, టాస్క్ ల పరంగా వీక్ గా ఉన్న షణ్ముఖ్ విన్నర్ అంటే చాలామంది ఒప్పుకోవడం లేదు.
కానీ తాజాగా ఓటింగ్ లిస్ట్ పరిశీలిస్తే.. హాట్ స్టార్ ఓటింగ్ లో సన్నీ కి ఎక్కువ ఓట్స్ పోలవుతుంటే.. మిస్సెడ్ కాల్ డేటా లో షణ్ముఖ్ కి ఎక్కువ ఓట్స్ పోలవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవగా.. సోమవారం, మంగళ వారం సన్నీనే ఓటింగ్ పరంగా టాప్ లో ఉండగా.. మూడోరోజు మాత్రం మిస్సెడ్ కాల్ ఓటింగ్స్ లో షణ్ముఖ్ మొదటి ప్లేస్ లోకి రావడం షాకిస్తుంది అంటున్నారు. ఇక సింగర్ శ్రీరామ్ కి కూడా మొదటి రెండు రోజులతో పోలిస్తే.. ఓటింగ్ శాతం పెరిగింది అని, ఆ తర్వాతి స్థానాల్లో సిరి, మానస్ లు ఉన్నారని అంటున్నారు. మరి మిగతా రెండు రోజుల్లో సన్ని - షణ్ముఖ్ లలో ఎవరో ఒకరు విన్నర్ గా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.