Advertisementt

బి టౌన్ కొంప ముంచిన కరణ్ జోహార్ పార్టీ

Wed 15th Dec 2021 09:43 AM
karan johar,karan johar party,kareena kapoor,amrita arora,maheep kapoor,covid 19  బి టౌన్ కొంప ముంచిన కరణ్ జోహార్ పార్టీ
Karan Johar party under scanner after Kareena, Amrita test Covid positive బి టౌన్ కొంప ముంచిన కరణ్ జోహార్ పార్టీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ అంటే.. బడా పార్టీలకు మారుపేరు. ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమాలు నిర్మిస్తూనే అప్పుడప్పుడు దర్శకత్వం చేసే కరణ్ జోహార్.. బి టౌన్ బడా సెలెబ్రిటీ. ఇక వీకెండ్ పార్టీలు, ఫెస్టివల్ పార్టీస్, బర్త్ డే పార్టీస్ అంటూ కరణ్ జోహార్ చేసే హడావిడి ఏ దర్శకనిర్మాతా చెయ్యరు. స్టార్ కిడ్స్ కి స్పెషల్ పార్టీలు, 40 ప్లస్ సెలబ్రిటీస్ కి ఒక పార్టీ, ప్రీ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ సెలబ్రిటీస్ ని తమ ఇంటి చుట్టూనే తిప్పుకుంటాడు. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, ఎక్కువగా కరణ్ కాంపౌండ్ లోనే కనిపిస్తారు. అలాంటి కరణ్ జోహార్ ఇచ్చిన ఓ పార్టీ ఇప్పుడు బి టౌన్ కొంప ముంచింది.

రీసెంట్ గా కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి హాజరైన కొంతమంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం బాలీవుడ్ లో కరీనా కపూర్ ఖాన్ కోవిడ్ బారిన పడింది. కరీనా కపూర్ తో పాటుగా అమృత అరోరాకి, సిమా ఖాన్‌, మహీప్‌ కపూర్‌లకు కూడా కొవిడ్‌ సోకింది. అయితే వీరంతా డిసెంబర్ 8 న కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి హాజరైనవారే. ఈ పార్టీకి హాజరైన వారిలో దాదాపుగా 12 మందికి కరోనా బారిన పడ్డారని, అయితే పార్టీలో ఒకరు తుమ్ముతూ దగ్గుతూ తిరిగారని, వాళ్ళ ద్వారానే వీరికి కరోనా సోకి ఉంటుంది అని అంటున్నారు.

ఇక కరీనా కపూర్ కి కరోనా అని తెలియగానే హోమ్ క్వారంటైన్ కి వెళ్లారని ఆమె మేనేజర్ తెలిపారు. మరోపక్క కరీనా కపూర్ ఇంట్లోని వారందరికీ.. టెస్ట్ చెయ్యాలని అధికారులు రాగా..  కరీనా కపూర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ సహకరించలేదని, అలాగే కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ గురించి అడిగినా.. వారు సరిగా సమాధానం చెప్పలేదని, తర్వాత సైఫ్ అలీ ఖాన్ ముంబై లో లేడని, ఆయన ముంబై వదిలి వారం అయ్యింది అని, కానీ అయన ఎక్కడికి వెళ్లారని అడిగినా.. కరీనా కపూర్ ఫ్యామిలీ సరైన సమాధానం ఇవ్వలేదని అంటున్నారు.

Karan Johar party under scanner after Kareena, Amrita test Covid positive:

Karan Johar Party Turns Hotspot, Kareena Kapoor, Amrita Arora, Maheep Kapoor Test COVID Positive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ