పుష్ప పాన్ ఇండియా ఫిలిం డిసెంబర్ 17 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ హడావిడిలో పుష్ప టీం ఉంది. అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్స్ అంటూ హైదరాబాద్ - చెన్నై, చెన్నై - హైదరాబాద్, బెంగుళూర్, కొచ్చి, ముంబై అంటూ గాల్లో చక్కర్లు కొడుతున్నాడు. పుష్ప ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ ఆయా భాషల్లో పుష్ప ప్రెస్ మీట్స్ అంటూ రిలీజ్ ముందు ఒంటి చేత్తో కష్టపడుతున్నాడు. ఇక రేపు బుధవారం బెంగుళూర్, కొచ్చి, గురువారం ఉదయం ముంబైలో, సాయంత్రానికి హైదరాబాద్ లో పుష్ప ప్రెస్ మీట్స్ పెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఇంత హడావిడిగా తిరుగుతున్న పుష్పాకి ఓ గుడ్ న్యూస్.
అది ఏపీలో టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వ జీవో ని రద్దు చేస్తూ హై కోర్టు తీర్పునిచ్చింది. పాత టికెట్ రేట్స్ తోనే డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ లో టికెట్స్ అమ్మవచ్చని, టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని చెప్పింది. మరి ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఏపీ ప్రభుత్వం పై ఆశలు పెట్టుకుంది. టికెట్ రేట్స్ విషయంలో మరోసారి పునరాలోచించాలని.. కానీ ప్రభుత్వం దిగిరాలేదు.. దానితో గతంలో వకీల్ సాబ్, మొన్న అఖండ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. తమకు ఏ సినిమా అయినా ఒకటేనని, పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.
దానితో థియేటర్ యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.. కోర్టు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తీర్పు నివ్వడంతో .. పుష్ప మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. విడుదలకు ముందే పుష్ప కి నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.