రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ ఓకె చెప్పకముందే మంచి ఫ్రెండ్స్. ఒకరి సినిమాల ఈవెంట్స్ ఒకరు, ఒకరు ఫంక్షన్స్ కి మరొకరు వస్తుండేంతగా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో ఆర్.ఆర్.ఆర్ మూవీ తెరకెక్కినది. మరి మెగా - నందమూరి ఫాన్స్ అంటే మాములు విషయం అక్కడక్కడా. హీరోల విషయంలో స్క్రీన్ ప్రెజెన్స్, హీరోల నిడివి, కేరెక్టర్స్, కేరెక్టర్స్ లో పవర్ ఫుల్ నెస్.. అన్నింటిపై ఫాన్స్ కన్ను ఉంది. అంటే ఎవరి హీరో ఎక్కువ, ఎవరి హీరో తక్కువ అనేది ఫాన్స్ మధ్యన మంట రాజేస్తోంది. అందుకే రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఒక ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది.
అంటే వాళ్ళు ప్లాన్ చేసారో.. లేదంటే అలానే ఉంటారో కానీ.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో స్టేజ్ మీద ఫ్రెండ్లీ గా చేసే అల్లరికి ఫాన్స్ అయితే ఫిదా. ఎన్టీఆర్ ని చరణ్ కితకితలు పెట్టడం, చరణ్ ని తారక్ గిల్లడం..అలాగే ఎన్టీఆర్ జోక్స్ వెయ్యడం, ఇంకా కోవిడ్ టైం లో చరణ్ ఇంటికి నేను, మా ఇంటికి చరణ్ వస్తుండేవాడు అని ఎన్టీఆర్ చెప్పడం, మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్ షిప్ బాండ్ బాగుంది అని, ఖచ్చితంగా తెర మీద మెస్మరైజ్ చెయ్యడం పక్క అంటున్నాడు. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ కాన్సెప్ట్ చెప్పకముందే ఫ్రెండ్స్ అని, ఆయన స్క్రిప్ట్ లో లేనిది మా మధ్యన ఫ్రెండ్ షిప్ బాండ్ తెర పై పండుతుంది అని చరణ్ చెప్పాడు..
మరి చరణ్ - తారక్ లు మధ్య అంత స్నేహంగా ఉంది.. అభిమానులు అర్ధం చేసుకుని.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా గొడవలు పడకుండా ఉంటారని అనుకున్నారమేమో.. చరణ్ - తారక్ ల అనుబంధం. ఎక్కడ, ఎప్పుడు చూసినా సూపరే.. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి గొడవలు పడకుండా అగ్రిమెంట్స్ రాసుకుని ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చారని టాక్ వినిపిస్తుంది.