బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. మరో ఐదు రోజుల్లో గ్రాండ్ ఫినాలే తో బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి సర్ ప్రైజ్ చెయ్యడానికి బిగ్ బాస్ యాజమాన్యం రెడీ అవుతుంది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్స్ లో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు. గత సీజన్ లో మెగాస్టార్ చిరు ఫినాలే ఈవెంట్ లో పాల్గొని.. సీజన్లో 4 కంటెస్టెంట్స్ కి తన సినిమాల్లో ఆఫర్స్ వెల్లువలో తడిపేసారు.. అందుకే సీజన్ 5 గ్రాండ్ ఫినాలే పై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈసారి మెగాస్టార్ చిరు గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ కాదంటున్నారు.
అంటే నాగార్జున బాలీవుడ్ లో నటించిన బ్రహ్మాస్త్ర మూవీ టీం.. హైదరాబాద్ కి రాబోతుంది. అమితాబచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ లు హైదరాబాద్ కి వచ్చి బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ చెయ్యబోతున్నారు. ఇక్కడ ఓ హోటల్ లో బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.. దానికి రాజమౌళి చీఫ్ గెస్ట్.. ఇక బ్రహ్మాస్త్ర టీంని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ఆహ్వానించారని.. వారితో పాటుగా రామ్ చరణ్ కూడా గెస్ట్ గా రాబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అలియా భట్, రణబీర్ కపూర్, నాగార్జున, రామ్ చరణ్ లు బిగ్ బాస్ సీజన్ 5 గెస్ట్ లు గా ఫిక్స్ అంటున్నా.. ఇంకా బిగ్ బాస్ యాజమాన్యం క్లారిటీ అయితే ఇవ్వలేదు.