Advertisementt

సైలెంట్ గా అమెరికాకి సూపర్ స్టార్?

Mon 13th Dec 2021 10:55 PM
mahesh babu,namrata shirodkar,hyderabad,airport,mahesh babu and namrata,hyderabad airport  సైలెంట్ గా అమెరికాకి సూపర్ స్టార్?
Mahesh Babu - Namrata spotted at hyderabad Airport సైలెంట్ గా అమెరికాకి సూపర్ స్టార్?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈమధ్యన అమెరికాకి వెల్ళబోతున్నారని అన్నారు. సర్కారు వారి పాటు షూటింగ్ లో బిజీగా ఉండడమే కాకుండా.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు, బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో లకి అతిధిగా హాజరై అందరికి షాకిచ్చిన మహేష్ బాబు.. సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేకిచ్చి అమెరికా వెళుతున్నారని అన్నారు. ఎందుకంటే మహేష్ బాబు మోకాలి శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్ళబోతున్నారు.. అక్కడ మోకాలి ఆపరేషన్ చేయించుకుని మహేష్ ఇండియాకి తిరిగివస్తారని అన్నారు. అయితే గత పది రోజులుగా మహేష్ అమెరికా ప్రయాణ వార్తలేవి వినిపించలేదు.

తాజాగా మహేష్ బాబు - నమ్రతలు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మహేష్, నమ్రతలు మాస్క్ లతో ఎయిర్ పోర్ట్ లో కనిపించేసరికి.. మహేష్ బాబు భార్య తో కలిసి సైలెంట్ గా అమెరికా వెళుతున్నారని, అక్కడే మోకాలి ఆపరేషన్ చేయించుకోబోతున్నారనే న్యూస్ మొదలయ్యింది. ప్రస్తుతం, మహేష్ - నమ్రత ల ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది అమెరికా వెళ్లడానికేనా.. లేదంటే అనే అనుమానంలో మహేష్ ఫాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే మహేష్ సర్కారు వారి పాట షూట్ ని పక్కనబెట్టేసి.. మోకాలి ఆపరేషన్ కోసం గ్యాప్ తీసుకోబోతున్నారని మాత్రం తెలుస్తుంది. ఇక రెండు నెలలు రెస్ట్ తర్వాతే మహేష్ మళ్లీ షూటింగ్స్ కి హాజరవుతారని అంటున్నారు.

Mahesh Babu - Namrata spotted at hyderabad Airport:

Mahesh Babu and Namrata Shirodkar spotted at Hyderabad Airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ