Advertisementt

ప్రాజెక్ట్ కే: ముంబైకి చెక్కేసిన దీపికా పదుకొనే

Mon 13th Dec 2021 10:31 PM
prabhas,deepika padukone,project k,nag ashwin,vyjayanthi movies,deepika with prabhas,project k pan world project  ప్రాజెక్ట్ కే: ముంబైకి చెక్కేసిన దీపికా పదుకొనే
Deepika Padukone wraps up Project K 1st schedule ప్రాజెక్ట్ కే: ముంబైకి చెక్కేసిన దీపికా పదుకొనే
Advertisement
Ads by CJ

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే రెగ్యులర్ షూట్ ఈమధ్యనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ భామ దీపికా పదుకొనే.. ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చింది. రీసెంట్ గా ప్రభాస్ కూడా ప్రాజెక్ట్ కే షూట్ లో జాయిన్ అయినట్లుగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.. ఇక ప్రాజెక్ట్ కే ఫస్ట్ షెడ్యూల్ లో దీపికా పదుకొనె - ప్రభాస్ కలయికలో సీన్స్ చిత్రీకరిస్తున్నట్లుగా, అలాగే వరల్డ్ నెంబర్ వన్ కెమెరా ముందు వీరిద్దరూ పెర్ఫర్మ్ చేసిన ఓ సీన్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు మేకర్స్.

ఆ వీడియోలో దీపికా - ప్రభాస్ చెయ్యి చెయ్యి కలిపారు. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ తెలుగు వంటకాలను దీపికా పదుకునెకి రుచి చూపించాడని.. తన స్టయిల్లో దీపికా ని ప్రభాస్ సర్ ప్రైజ్ చేసి.. వెరైటీ వంటకాలతో ఇక్కడి అతిథి మర్యాదలను చేశాడని దీపికా ఇన్స్టా లో పోస్ట్ చేసింది. మరోపక్క ప్రాజెక్ట్ కే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అవడంతో.. దీపికా పదుకొనే ముంబై కి చెక్కేసింది. హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిన దీపికా.. ప్రాజెక్ట్ కే అప్ డేట్ ఇస్తూ.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని చెప్పడమే కాదు, హైద్రాబాద్ ఎంతో నచ్చింది అని, ఎంతో ప్రేమగా చూసుకున్నారంటూ దీపిక ట్వీట్ చేసింది. 

ఇక మళ్ళీ దీపికా పదుకొనే సెకండ్ షెడ్యూల్ కోసం త్వరలోనే హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది.  

Deepika Padukone wraps up Project K 1st schedule:

Prabhas treats Deepika Padukone with delicious

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ