Advertisementt

బిగ్ బాస్ 5: ఆర్జే కాజల్ రెమ్యునరేషన్ లీక్

Mon 13th Dec 2021 01:41 PM
rj kajal,bigg boss telugu 5,bigg boss,kajal remuneration  బిగ్ బాస్ 5: ఆర్జే కాజల్ రెమ్యునరేషన్ లీక్
Bigg Boss 5: RJ Kajal Remuneration Leak బిగ్ బాస్ 5: ఆర్జే కాజల్ రెమ్యునరేషన్ లీక్
Advertisement
Ads by CJ

ఆర్జే గా పరిచయం అక్కర్లేని పేరు కాజల్ ది.. అది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక.. ఆ పేరు మరింతగా మార్మోగిపోయింది. కారణం ఆమె నోరు, కాజల్ స్ట్రాటజీలు. గొడవలు. కాజల్ ఎక్కడ ఉంటే అక్కడ గొడవే అన్నట్టుగా హౌస్ లో ప్రతి వారం జరిగే గొడవలో కాజల్ ముందుండేది. అలానే మూడు నాలుగు వారాలకే వెళ్లాల్సిన కాజల్.. చివరి వారం అంటే టాప్ 5 కి వెల్ళబోయే వీక్ వరకు హౌస్ లో ఉండగలిగింది. అందులోనూ స్ట్రాంగ్ కాంటస్టెంట్స్ అయిన సన్నీ, మానస్ ల ఫ్రెండ్ షిప్ తో కాజల్ హౌస్ లో అన్ని వారాలు ఉండగలిగింది అనడంతో ఎలాంటి సందేహము లేదు. 

అయితే బిగ్ బాస్ కి ఎంటర్ అయిన మొదటి వారం నుండే ఆమెని చాలామంది హేట్ చేసారు. హౌస్ లో సన్నీ, మానస్ తప్ప మిగతా అందరూ కాజల్ ని తిట్టినవాళ్ళే కానీ, తిట్టని వాళ్ళు లేరు. ఇక బిగ్ బాస్ లో కాజల్ రెమ్యునరేషన్ లీక్ అయ్యింది. కాజల్ హౌస్ లో ఉండి.. ఎంటెరైన్ చేసినందుకు గాను.. వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుందని సమాచారం. అంటే కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 14 వారాలకు గాను ఆమెకి 30 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. మరి హౌస్ ఎలోకి ఎంటర్ అయినప్పుడు కాజల్ తనకు ముప్పై లక్షలు అప్పు ఉందని చెప్పింది. ఇప్పుడు బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కాజల్ దాన్ని తీర్చబోతుందన్న మాట.

Bigg Boss 5: RJ Kajal Remuneration Leak:

RJ Kajal Earnings From Bigg Boss Telugu 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ