డిసెంబర్ 17, వచ్చే శుక్రవారం ఐదు భాషల్లో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప మూవీ ప్రమోషన్స్ సందడి అటు సోషల్ మీడియా, ఇటు బయట కూడా మొదలయ్యింది. పుష్ప కేరెక్టర్స్ లుక్స్, సాంగ్స్ తో, పుష్ప ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచుకున్న పుష్ప మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అంతగా హైలెట్ అవ్వలేదనిపిస్తుంది. అల్లు అర్జున్ ఈవెంట్ అంటే ఓ రేంజ్ లో ఉండాలి.. ఆ రేంజ్ పుష్ప ఈవెంట్ లో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ లో ఆయన ఫాన్స్ ఉన్నారు. బాలీవుడ్ నుండి ఎవరో ఒక గెస్ట్ ని పిలిచి సినిమాని అలా ప్రమోట్ చేస్తే బావుండేది, అలాగే ఇక్కడైనా ఎవరో ఒక స్టార్ హీరోని అయినా గెస్ట్ గా పిలవాల్సింది. రాజమౌళి, కొరటాలతో సరిపెట్టేశారు.. పాపం సుకుమార్ కూడా పుష్ప రిలీజ్ హడావిడిలో బిజీగా ఉండి ఈవెంట్ కి రాలేకపోయారు.
అలాగే పుష్ప స్టేజ్ మీద కేవలం పుష్ప సాంగ్స్ హడావిడి తప్ప.. గెస్ట్ లు స్పీచ్ లు కానీ, ఆఖరికి అల్లు అర్జున్ మాట్లాడిన స్పీచ్ కానీ అంతగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అనేది అల్లు అర్జున్ ఫాన్స్ అభిప్రాయం . ఎన్టీఆర్ అయినా, లేదంటే మహేష్ అయినా, ప్రభాస్ అయినా పుష్ప ఈవెంట్ కి వచ్చునంటే.. ఆ హీరోల ఫాన్స్ క్రేజ్ కూడా పుష్ప కి కలికొచ్చేది అని అంటున్నారు. పుష్ప రిలీజ్ దగ్గర పడి.. ప్రమోషన్స్ కి పెద్దగా టైం లేక.. కాస్త గజి బిజీ అయిన ఫీలింగ్ పుష్ప ఈవెంట్ తెప్పించింది అంటున్నారు.