Advertisementt

జబర్దస్త్ ఓకె.. ఢీ నుండి అవుట్

Sun 12th Dec 2021 12:42 PM
sudigaali sudheer,jabardasth show,comedy,dhee dance show,dhee season 14  జబర్దస్త్ ఓకె.. ఢీ నుండి అవుట్
Jabardasth Ok, Out of the Dhee Dance Show జబర్దస్త్ ఓకె.. ఢీ నుండి అవుట్
Advertisement
Ads by CJ

ఈటీవీలో జబర్దస్త్ మొదలైంది మొదలు సుడిగాలి సుధీర్ తన స్కిట్స్ తో కామెడీ ప్రియులని ఎంటర్టైన్ చేస్తున్నాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్, మధ్య మధ్యలో ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ తో సుధీర్ బాగా పాపులర్ అయ్యాడు. అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మీ తో ఎఫ్ఫైర్ అనే ప్రచారంతో ఇంకాస్త పాపులర్ అయ్యాడు. ఇక తర్వాత ఢీ డాన్స్ షో కి ఆది తో కలిసి మెంటర్ గాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గాను, మధ్య మధ్యలో వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరోగాను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ ని వీడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానికి సుధీర్ అండ్ శ్రీను, రామ్ ప్రసాద్ లు జబర్దస్త్ స్టేజ్ పై నిలబడి తాము జబర్దస్త్ నుండి వెళ్లడం లేదని, ఇంకా గట్టిగ నవ్వించాలని డిసైడ్ అయినట్లుగా చెప్పి ఫుల్ క్లారిటీ  ఇచ్చేసారు.

జబర్దస్త్ లో సుధీర్ ఉండడేమో అనుకుంటే..జబర్దస్త్ నుండి వెళ్ళేదే లే అని చెప్పిన సుధీర్ మరో షో, ఢీ డాన్స్ షో కనిపించలేదు. హైపర్ ఆది తో కలిసి మెంటర్ గా వ్యవహరించిన సుధీర్ ఢీ డాన్స్ 13th కింగ్స్ vs క్వీన్స్ గ్రాండ్ ఫినాలే వరకు ఉండి.. హైపర్ అది తో కలిసి అద్భుతమైన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఢీ 14 కి మాత్రం సుధీర్ మిస్ అయ్యాడు. సుధీర్ ప్లేస్ లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. ఢీ డాన్స్ షో లో ఆది తో పాటుగా అఖిల్ మెంటర్ గా మారాడు. మరి వెండితెర మీద హీరోగా అవకాశాలు రావడంతోనే.. సుడిగాలి సుధీర్ తనకి మంచి పాపులారిటీ ఇచ్చిన ఢీ డాన్స్ షోల నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. 

Jabardasth Ok, Out of the Dhee Dance Show:

Sudigaali Sudheer opts out of Dhee 14  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ