బిగ్ బాస్ సీజన్ 5 గత రాత్రి ఎపిసోడ్ లో ఈ 14 వారాల్లో ఎవరు రిగ్రెట్ అయిన విషయాన్నీ లోపల కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మరీ అడిగాడు నాగ్. అలాగే ఉన్న అరుగు కంటెస్టెంట్స్ లో ఈ 14 వారాల్లో ఎవరు హిట్ స్టార్, ఎవరు ప్లాప్ స్టార్ అని అడగగా.. కాజల్ సన్నీ ని హిట్ స్టార్ అంది.. అలాగే మానస్ తో కలిసిన తర్వాత సన్నీ కనెక్ట్ అయ్యాడు.. తర్వాత ఫ్రెండ్లి గా ఎమోషనల్ గా బాండ్ అయ్యాడు. సో అందుకే హిట్ స్టార్ అండ్.. ప్లాప్ స్టార్ అనగానే షణ్ముఖ్ కి ప్లాప్ స్టార్ టాగ్ ఇచ్చింది.. తాను అన్ని ఎక్కువగా స్టేట్మెంట్స్ సాగదీస్తాడు అనగానే.. నాగార్జున నువ్వు కూడా అంతే కదా కాజల్ అన్నారు. ఇక సన్నీ లేచి హీరో బోర్డు మానస్ కి వేసాడు. నాకు బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పటినుండి నాకు సపోర్ట్ గా నిలిచాడు అన్నాడు.. ఇక షణ్ముఖ్ మాత్రం ప్లాప్ అని చెప్పను కానీ.. ఇమిటేషన్ కేరెక్టర్ లో షణ్ముఖ్ సూర్య లాగా ఇంకాస్త బాగా చేసుంటే బావుండేది అన్నాడు.
దానికి నాగార్జున కేవలం ఇదే చూస్తావా.. 14 వారాలకు చూడవా.. అనగా షణ్ముఖ్ మొన్నటివరకు చాలా బాగా ఆడాడు.. కానీ ఈ సూర్య కేరెక్టర్ లో బాగా చెయ్యలేకపోయాడు అన్నప్పటికీ.. నాగార్జున ఆలోచించు అని సన్నీ మైండ్ సెట్ మార్చేశారు. దానితో సన్నీ నాకు ఫస్ట్ నుండి ఈ హౌస్ లో సిరి కాస్త గొడవ పడుతుంది అన్నాడు.. దానితో సిరికి సన్నీ ప్లాప్ బోర్డు వేసాడు. సిరి సన్నీకి వేసింది. ఇక టాప్ 5 కి శ్రీరామ్ చంద్ర టికెట్ టు ఫినాలేలో గెలిచి వెళ్లగా.. నిన్న శనివారం సన్నీ టాప్ 5 కి వెళ్లగా.. ఈ వారం ఫైనల్ గా 14 వ కంటెస్టెంట్ గా కాజల్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.