Advertisementt

బిగ్ బాస్ 5: ముగ్గురు ఫ్రెండ్స్ లో.. ఒకరు అవుట్

Sat 11th Dec 2021 08:28 PM
rj kajal,big boss,bigg boss telugu,rj kajal eliminated,rj kajal eliminated from big boss 5  బిగ్ బాస్ 5: ముగ్గురు ఫ్రెండ్స్ లో.. ఒకరు అవుట్
Bigg Boss 5: Contestants for the final revealed బిగ్ బాస్ 5: ముగ్గురు ఫ్రెండ్స్ లో.. ఒకరు అవుట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది.. బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారంలో, గ్రాండ్ ఫినాలే వారంలో టాప్ కంటెస్టెంట్స్ గా ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్నారు.. అనే క్యూరియాసిటీకి తెరపడింది. ఈ వారం ఇంటి నుండి వెళ్ళబోయేవారు, ఎవరు టాప్ 5 కి వెళ్ళబోతున్నారో అనేది బిగ్ బాస్ లీకులు బయటపెట్టేశాయి. ఈ వారం ఓటింగ్స్ లో హెచ్చు తగ్గులు, స్థానాలు ఆటోమాటిక్ గా మారిపోవడం వంటి వాటితో.. సిరి, మానస్, కాజల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికి ప్రేక్షకులు ఓ క్లారిటీ రాలేకపోయారు. అయితే ఫైనల్ గా ఆర్జే కాజల్ చివరి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ హౌస్ నుండి వెళ్ళింది. సన్నీ, మానస్ తో ఫ్రెండ్లీ గా టాస్క్ ల్లో పట్టు సాధించిన కాజల్ బిగ్ బాస్ హౌస్ లోకి 17 వ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన కాజల్ మూడు నాలుగు వారాలకే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే.. స్ట్రాటజీలతో 14 వారాలు లాక్కొచ్చేసింది.

ఇక బిగ్ బాస్ టాప్ 5 లో ఉండాలనేది తన కోరిక అని, తన ఫ్రెండ్స్ తో పాటుగా అంటే సన్నీ, మానస్ లతో పాటుగా తాను టాప్ 5 లో ఉండాలని కోరుకున్న కాజల్ కి ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో కన్నా తక్కువ ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఫైనల్ వీక్ లో ఫైనల్ గా కాజల్ ఎలిమినేట్ అవ్వగా.. ముందే టాప్ 5 లోకి అడుగుపెట్టిన శ్రీరామ చంద్రతో పాటుగా ఈ వారం షణ్ముఖ్, సన్నీ, మానస్, సిరులు టాప్ 5 లోకి అడుగుపెట్టారు. మరి డిసెంబర్ 19 న జరగబోయే బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే లో ఎవరు విన్ అవుతారో అనే క్యూరియాసిటీ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఇప్పుడు మొదలైంది. 

Bigg Boss 5: Contestants for the final revealed:

Bigg Boss 5 Telugu: RJ Kajal Eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ