Advertisementt

అఫీషియల్: ప్రభాస్ ప్రాజెక్ట్ కే స్టార్ట్

Sat 11th Dec 2021 07:56 PM
prabhas,amitabh bachchan,deepika padukone,nag ashwin,vyjayanthi movies,project – k,project – k shoot begins  అఫీషియల్: ప్రభాస్ ప్రాజెక్ట్ కే స్టార్ట్
Prabhas Project – K Shoot Begins అఫీషియల్: ప్రభాస్ ప్రాజెక్ట్ కే స్టార్ట్
Advertisement
Ads by CJ

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కలయికలో ఇంతకుముందే పూజా కార్యక్రమాలతో మొదలైన ప్రాజెక్ట్ కే రెగ్యులర్ షూట్ నేడు అంటే డిసెంబర్ 11 న అఫీషియల్ గా మొదలైనట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ చెయ్యబోయే ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపించబోతున్నారు.

ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ - హీరోయిన్ దీపికా పదుకొనె కాంబో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రాజెక్ట్ కే కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. మొదటి రోజు ప్రాజెక్ట్ కే మేకర్స్ ప్రభాస్ మరియు దీపికపై చిత్రీకరించిన మొదటి షాట్ యొక్క వీడియో బైట్‌ను విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరాలో ప్రభాస్ మరియు దీపికా పదుకొణె చేతులు కలిపినట్లు ఆ వీడియో లో చూడొచ్చు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే అప్ డేట్ ఇలా వచ్చిందో లేదో.. ప్రభాస్ ఫాన్స్ అలా పండగ చేసుకోవడం మొదలు పెట్టారు. అత్యంత భారీ బడ్జెట్ తో మొదలైన ప్రాజెక్ట్ కే లో బడా స్టార్స్ నటించడం, నాగ్ అశ్విన్ అప్ డేట్స్ తో అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Prabhas Project – K Shoot Begins:

Prabhas, Amitabh Bachchan, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies Project – K Shoot Begins

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ