Advertisementt

బిగ్ బాస్ 5: కాజల్ కి గడ్డి పెట్టిన నాగ్

Sat 11th Dec 2021 06:35 PM
bigg boss 5,bigg boss telugu,nagarjuna rj kajal,sunny,shanmukh,siri  బిగ్ బాస్ 5: కాజల్ కి గడ్డి పెట్టిన నాగ్
Bigg Boss 5: Nagarjuna satires on Kajal బిగ్ బాస్ 5: కాజల్ కి గడ్డి పెట్టిన నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం రోజుల్లో ముగియబోతుంది. డిసెంబర్ 19 న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ముగియబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ ఇప్పటికే టాప్ 5 కి చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో నాలుగు టాప్ 5 కి మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. ఇక ఈ రోజు శనివారం, నాగార్జున వస్తారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తప్పులని అడుగుతూ క్లాస్ పీకే రోజు.. ఈ రోజు కూడా అదే జరిగింది. సీజన్ 5 లో మొదటి నుండి ఏ వారం ఎవరు తప్పు చేసారో అనేది క్లాక్ లో ఉన్న ముల్లుతో వారం పెట్టి.. ఎవరేం తప్పుచేసారో.. దానికి ఎంత పశ్చాత్తాప పడ్డారో చెప్పాలి. మరి వీల్ అఫ్ ద వీక్స్ లో కాజల్ లేచి నేను తప్పు చేశాను.. కానీ అది ఏ వారమో గుర్తు లేదు అనగానే.. నీకు గుర్తు లేదా.. అని నాగ్ అనేసరికి హౌస్ మేట్స్ మొత్తం నవ్వేశారు. ఇక సిరి 11th వీక్ లో తప్పు చేశాను.. వెనక్కి వెళ్లి సరిచేసుకోవాలనుకుంటే.. మళ్ళీ అలా చెయ్యను అంది. 

అదే 11th వీక్ లో నేను ఏదైతే చేసానో.. అది చాలా బ్యాడ్ అన్నాడు షణ్ముఖ్. సన్నీ కూడా క్లాక్ లో ముల్లు పెట్టి ఆ వారం నాకు చాలా బాధనిపించింది సర్.. తట్టుకోలేకపోయాను అన్నాడు. మానస్ మాత్రం ఓ వీక్ లో సన్నీ ఫస్ట్ టైం ఏడవడం చూసాను, అదే ఫస్ట్ టైం నేను ఎమోషనల్ అయ్యాను అన్నాడు.

ఇక హౌస్ లో హిట్స్ స్టార్ ఎవరు? ప్లాప్ స్టార్ ఎవరు? అని నాగ్ అడగ్గానే.. కాజల్ షణ్ముఖ్ కి ప్లాప్ స్టార్ టాగ్ పెట్టింది..దాని నుండి ఇంకో స్టేట్మెంట్ తీస్తాడు. 3, 4 సిస్టువేషన్స్ లో అబ్జర్వ్ చేశాను అనగానే.. నాగార్జున మరి నువ్వు చేసేదేమిటి, నువ్వు అలాగే చేస్తావ్ అన్నాడు.. నేను నా అంతట నేను వేళ్లను సర్ అని కాజల్ అన్నప్పటికీ.. నాగ్ ఒప్పుకోలేదు.. ఇక శ్రీరామ్ కూడా కాజల్ ఒక్కోసారి స్వీట్ గా ఉంటుంది, ఒక్కోసారి వైల్డ్ గా ఉంటుంది అన్నాడు. సిరి సన్నీకి, సన్నీ సిరికి ప్లాప్ స్టార్ టాగ్ ఇచ్చుకున్నారు.ఇక శ్రీరామ్ తర్వాత ఎవరు ఫస్ట్ టాప్ 5 కి వెళతారో అనేది బెలూన్స్ తో మెస్సేజ్ పంపారు నాగార్జున. ఇది ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్.

Bigg Boss 5: Nagarjuna satires on Kajal:

Bigg Boss Telugu 5: New Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ