అల్లు అర్జున్ కి అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేసిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఐదు భాషల్లో డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అటు సుకుమార్ కూడా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పుష్ప ది రైజ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే భారీ ధరలకు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ లెవల్లో జరిగింది.
ఇప్పటికే చాలా ఏరియాలలో పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు వచ్చాయి. మరోపక్క ట్రేడ్ లోను అనూహ్య స్పందన ఏర్పడింది. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ అలానే నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) కలుపుకొని 250 కోట్లు రిలీజ్ కి ముందే బిజినెస్ దక్కించుకుంది పుష్ప ది రైజ్. ఫస్ట్ టైం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో పుష్ప ది రైజ్ పై సినిమా బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి పెరిగి.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ - తగ్గేదేలె అంటూ అంచనాలు అమాంతం పెంచేసింది.