Advertisementt

రామ్ చరణ్ సైలెంట్.. ఎన్టీఆర్ వైలెంట్

Sat 11th Dec 2021 04:16 PM
rrr,rrr hyderabad press meet,rrr press meet highlights,ntr,tarak,ram charan,rajamouli  రామ్ చరణ్ సైలెంట్.. ఎన్టీఆర్ వైలెంట్
Ram Charan Silent, NTR Violent రామ్ చరణ్ సైలెంట్.. ఎన్టీఆర్ వైలెంట్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ తో ఆర్.ఆర్.ఆర్ టీం గత రెండు రోజులుగా గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రవేట్ జెట్ అద్దెకి తీసుకుని మరీ ఆర్.ఆర్.ఆర్ లో ముఖ్యులైన రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్య, హీరోయిన్ అలియా భట్ లు.. ఉదయం ముంబై, సాయంత్రం హైదరాబాద్, మళ్ళీ ఉదయం బెంగుళూర్, సాయంత్రం చెన్నై.. మళ్ళీ ఉదయం హైదరాబాద్ అంటూ ఫ్లైట్ ఎక్కడం ప్రెస్ మీట్ పెట్టడం ఫ్లైట్ దిగడం చేస్తున్నారు. ఇక ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ మిస్ అయినా.. అక్కడ అజయ్ దేవగన్ ప్రెస్ మీట్ ని కవర్ చేసారు. తరవాత బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్ ప్రెస్ మీట్స్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హుషారుగా పాల్గొన్నారు.

ప్రతి ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ హుషారుగా, వైలెంట్ గా రాజమౌళిని రామ్ చరణ్ ని ఏడిపిస్తూ కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లరి పైకి కనబడకుండా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సరదాగా కామెడీగా కనిపిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం ప్రొఫెషనల్ గా సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకి 30 ఏళ్ళు వచ్చినా.. అల్లరి పోలేదని.. 300 రోజుల షూటింగ్ లో వీరి అల్లరి వలన 25 రోజులు సమయం వేస్ట్ అయ్యింది అని, రామ్ చరణ్ గిల్లడంటూ తారక్ తనకి కంప్లైంట్ చేస్తాడని, కానీ చరణ్ సైలెంట్ గా తనకేం తెలియదు డైలాగ్ పేపర్ చూసుకుంటున్నా అంటాడని చెప్పగానే.. అది నిజం కదా అన్నాడు ఎన్టీఆర్.. అక్కడ కూడా ఎన్టీఆర్ రాజమౌళిని సైలెంట్ గా గిల్లేసాడు.. దెబ్బకి ఆయన కుర్చీ నుండి లేచి మైక్ తీసుకుని మరీ వారి అల్లరి పనులు గురించి చెప్పాడు. 

మా గొడవలు మీరు చూడలేదా.. అక్కడ పెదరాయుడిలా కూర్చొని మీరేం చేశారు, నవ్వడం తప్ప. ఆరోజు నాపై జరిగిన దాడిని మీరు ఆపారా, ఖండించారా.. అంటూ ఎన్టీఆర్ అడిగాడు. దాడా ఎవరు చేసారని చరణ్ కామ్ గా అడిగాడు.. ఇలా ఎన్టీఆర్ కాస్త యాక్టీవ్ గా సరదాగా కనిపిస్తే.. రామ్ చరణ్ మాత్రం సైలెంట్ గా కిల్లర్ లా కనిపించి ఫాన్స్ ని ఖుషి చేసారు.

Ram Charan Silent, NTR Violent:

RRR Hyderabad Press Meet Highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ