Advertisementt

ఫైనల్లీ ప్రభాస్ కూడా..

Sat 11th Dec 2021 12:34 PM
prabhas,nag ashwin,project k,deepika padukone,amitab,radhesyam movie,salaar movie,spirit movie,adipurush movie  ఫైనల్లీ ప్రభాస్ కూడా..
Prabhas enters Project K ఫైనల్లీ ప్రభాస్ కూడా..
Advertisement
Ads by CJ

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ వైపే అందరి చూపు.. సాహో తర్వాత వస్తున్న రాధేశ్యామ్ మూవీపై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో వస్తున్న రాధేశ్యామ్ జనవరి 14 సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. అయితే రాధేశ్యామ్ ప్రస్తుతం ప్రమోషన్స్ ఊపులో ఉండగా.. ప్రభాస్ ఇటు సలార్ మూవీ షూటింగ్ అలాగే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ మూవీ షూటింగ్స్ కి హాజరవుతూ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేతిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె షూటింగ్స్ ని చుట్టేస్తున్నాడు. నాగ్ అశ్విన్ హైదరాబాద్ లో ప్రాజెక్ట్ కే పూజ కార్యక్రమాలతో ప్రారంభించి అమితాబ్ పై ట్రయిల్ షూట్ చేసారు.

ఇక రీసెంట్ గా అంటే డిసెంబర్ 3 నుండి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె ని రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లగా.. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చేసింది. ప్రభాస్ మాత్రం నిన్న శుక్రవారమే అంటే డిసెంబర్ 10 నుండి ప్రాజెక్ట్ కే సెట్స్ లోకి ఎంటర్ అయ్యాడు.. సో అటు సలార్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో, ఇటు ప్రాజెక్ట్ కె షూటింగ్ తో ప్రభాస్ ఫుల్ బిజీ.. మధ్యలో రాధేశ్యామ్ ప్రమోషన్స్ ఉండనే ఉన్నాయి. ప్రాజెక్ట్ కే ని అశ్విని దత్ వాళ్ళు పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోతున్నారు.

Prabhas enters Project K:

Prabhas concentrates on Project K

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ