రాజమౌళి సినిమాలో అలియా భట్ అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.. అలియా భట్ తెలుగులో మొదటిసారి నటించడమే కాదు.. రాజమౌళి సినిమాలో నటిస్తుంది అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో సీత గా అలియా భట్ రామ్ చరణ్ అల్లూరి పాత్ర సరసన నటించింది. ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల కేరెక్టర్ అయినా రాజమౌళి సినిమా గనక ఒప్పుకున్నానని అంది అలియా భట్. ఇక ఈ సినిమా కోసం అలియా భట్ తెలుగు నేర్చుకుని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇక గత రెండు రోజులుగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ అంటూ నాలుగు సిటీస్ లో అదరగొట్టేస్తున్నారు. ఇద్దరి హీరోలని తీసుకుని, హీరోయిన్ అలియా భట్ ని వెంటబెట్టుకుని నిర్మాతతో కలిసి పొద్దున్నే ఓ చోట, రాత్రికి ఇంకో చోట అంటూ గాల్లో తిరిగేస్తున్నారు.
ముందుగా ముంబైలో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి.. సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ అన్నారు. ఇక శుక్రవారం ఉదయం బెంగుళూర్ లోను, సాయంత్రానికి చెన్నైలోని ప్రెస్ మీట్స్ పెట్టిన రాజమౌళి, ఈ రోజు శనివారం ఉదయం హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. మరి తెలుగు ప్రెస్ మీట్ లో అలియా భట్ తెలుగులో బాగున్నారా అంటూ అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పగిలిపోయింది, ముంబైలో అయితే మాకు పిచ్చెక్కిపోయింది అంటూ అదరగొట్టేసింది. ప్రత్యేకంగా ఆమె తెలుగు ట్యూటర్ ను కూడా పెట్టుకుని వీలైనంతవరకూ సినిమా కోసం భాషపై పట్టు సాధించింది. క్యూట్ గా కనిపించిన అలియా కి తెలుగు స్పష్టంగా అర్ధమవుతుంది అని చెప్పారు రాజమౌళి. ఇక హీరోలిద్దరూ అలియా భట్ తో ఉన్న మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు.
ఇక ముందు అలియా భట్ హైదరాబాద్ కి ఎంటర్ అవ్వగానే తారక్ ని కలిసింది అని రామ్ చరణ్ చెప్పగా.. ముందు నీతో జోడి కట్టింది కాబట్టి ఆమె గురించి నువ్వే మట్లాడమంటూ హీరోలు జోకులు వేసినా.. అలియా భట్ మీడియా అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి ఫ్లైట్ టైం అవుతుంది అంటూ ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయింది. తరవాత రాజమౌళి, హీరోస్ ప్రెస్ మీట్ కంటిన్యూ చేసారు.