Advertisementt

ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సమాధానం

Sat 11th Dec 2021 10:46 AM
rrr,rrr hyderabad press meet,rrr press meet highlights,rajamouli,ntr,ram charan,rrr heroes,ntr fans,ram charan fans  ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సమాధానం
Perfect answer to NTR and Charan Fans ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సమాధానం
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ పై చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఇద్దరిలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమాలు. రామ్ చరణ్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందా? లేదంటే ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందా? అసలు రామ్ చరణ్ కేరెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందా? ఎన్టీఆర్ కేరెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందా? ఆయన లుక్ బావుంటుందా? ఈయన లుక్ బావుంటుందా? అబ్బో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అభిమానుల మదిలో మెదులుతున్నాయి. ఇద్దరి స్టార్స్ ని రాజమౌళి ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఇలాంటి ప్రశ్నలకు రాజమౌళి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అభిమానులకి హోల్ సేల్ గా సమాధానం చెప్పేసారు. దీనితో ఫాన్స్ కూల్ అయ్యారో లేదో కానీ, మీడియా మాత్రం హ్యాపీ ఫీలైంది.

నేను ఆర్.ఆర్.ఆర్ చేద్దామనుకున్నప్పుడు ఎన్టీఆర్ కి ఫోన్ చేసి రమ్మన్నాను, అలాగే రామ్ చరణ్ ని ఓసారి కలుద్దాం రమ్మనగానే ఎన్టీఆర్ ఫస్ట్ వచ్చి కూర్చున్నాడు. తర్వాత చరణ్ వచ్చి అక్కడ తారక్ ని చూసి సర్ ప్రైజ్ అయ్యాడు.. అదే విధంగా ఇక్కడికి చరణ్ ఎందుకు వచ్చాడో అని తారక్ అలానే ఫీలైయ్యాడు. ఇద్దరిని కూర్చోబెట్టి.. మీ ఇద్దరితో సినిమా తీద్దామనుకుంటున్నాను, ఇది కథా అని చెప్పగానే వారిద్దరూ స్పీచ్ లెస్ గా అలా చూస్తుండిపోయాడు. ఇక సినిమాలో నేను స్టార్ హీరోస్ తో సినిమా చెయ్యలేదు, నా కథకి ఇద్దరు యాక్టర్స్ అవసరం కాబట్టి చేశాను. ఇక సినిమాలో ఎవరి కేరెక్టర్ ఎక్కువ, ఎవరిది తక్కున, ఎవరి స్క్రీన్ స్పేస్ ఎక్కువ.. ఇలా కొలమానంలో కొలతలు పెట్టుకోలేదు.. ఖచ్చితంగా అభిమానులకి ఈ ప్రశ్న ఉన్నప్పటికీ.. అది సినిమాలోకి ఎంటర్ అవ్వగానే.. ఆ ప్రశ్నని పక్కనపెట్టేసి ఆర్.ఆర్.ఆర్ ని ఎంజాయ్ చేస్తారు.. నాకు ఇద్దరు స్టార్స్ కాదు.. రెండు ఆటం బాంబ్స్ దొరికాయి అంటూ.. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ కి ఎలాంటి సమాధానం కావాలో అలాంటి సమాధానం రాజమౌళి హైదరాబాద్ ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. 

Perfect answer to NTR and Charan Fans:

RRR Hyderabad Press Meet Highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ