డిసెంబర్ 2 న రిలీజ్ అయ్యి.. బాక్సాఫీసు భరతం పట్టిన బాలకృష్ణ అఖండ మూవీ అటు ఓవర్సీస్ లోను, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. వారం రోజులుగా అఖండ హడావిడి మాములుగా లేదు. బాలకృష్ణ - బోయపాటి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టేసి ఫాన్స్ కి పూనాలు తెప్పించారు. బాలకృష్ణ నట విశ్వరూపం తో ఆడియన్స్ ని మెస్మరైజ్ కాదు. అఘోర గెటప్ తో అదరగొట్టేసాడు. థమన్ అఖండ మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. అఖండ తో రిలీజ్ అయిన స్కైలాబ్ ఇంకా కొన్ని చిన్న సినిమాలకు నెగటివ్ టాక్ రావడంతో ఈ వారమంతా అఖండ నే హవా చూపించింది.
ఇక వచ్చే వారం కూడా అఖండ దే హవా లా కనబడనుండి. కారణం నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్ ఏవీ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. వరుడు కావలెను తో హిట్ కొట్టిన నాగ శౌర్య నిన్న ఫ్రెండే లక్ష్య అంటూ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకి సో, సో టాక్ వచ్చింది. అటు క్రిటిక్స్ కూడా సో, సో రేటింగ్స్, రివ్యూస్ ఇవ్వడంతో.. ఈ సినిమాకి సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ పడిపోయింది. ఇక శ్రియ శరన్, నిత్య మీనన్, ప్రియాంక జవల్కర్ కలయికలో ఎప్పుడో తెరకెక్కిన గమనం సినిమా కూడా డిసెంబర్ 10 న రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకైతే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. పూర్ రివ్యూస్, పూర్ రేటింగ్స్ తో క్రిటిక్స్ కూడా గమనం సినిమా ప్లాప్ అని తేల్చేసారు.. ఇంకా మడ్డి అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది.. ఆ సినిమా మాటల్లోనే లేదు.. మరి లక్ష్య, గమనం లాంటి సినిమాల టాక్ చూసాక ఈ వారం కూడా బాలయ్య అఖండ దే హవా అంటున్నారు మాస్ ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ వర్గాలు కూడా..
అందులోను అఖండ సక్సెస్ సెలెబ్రేషన్స్ ని వైజాగ్ లో అదిరిపోయే లెవల్లో నిర్వహించారు మేకర్స్. సో అఖండ ఇలాంటి ప్రమోషన్స్ తో ఇంకా ఇంకా సినిమాపై ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు.