కరోనా క్రైసిస్ మొదలయ్యాక సినిమా థియేటర్స్ మూత బడడంతో.. ఓటిటీల హవా మొదలైంది.. ఒకవేళ సిట్యువేషన్ బావుండి.. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా.. అవి ఓ 30 రోజుల నుండి 50 రోజుల లోపే ఓటిటీలలో రిలీజ్ చేస్తున్నారు.. పెద్ద సినిమాలైనా, వకీల్ సాబ్ లాంటి సినిమాలే రిలీజ్ అయినా 50 రోజుల్లోపు ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇక నిన్నగాక మొన్న లవ్ స్టోరీ విడుదలైన 30 రోజుల్లో ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అయితే జనవరి 7 న వరల్డ్ వైడ్ గా క్రేజీ మూవీగా రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రస్తుతం ప్రమోషన్స్ జోరులో ఉంది.. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా పై ఎంతగా అంచనాలున్నాయి.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అని మాస్ ఆడియన్స్, చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ చూసేందుకు క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ రేటు కి డిజిటల్ హక్కులను దక్కించుకున్న ZEE5 ఆర్.ఆర్.ఆర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు చేస్తుందో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ ఉండగా.. ముంబై లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ట్రైలర్ లాంచ్ లో ఆర్.ఆర్.ఆర్ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చేసారు. ఆర్.ఆర్.ఆర్ ఆన్‌లైన్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కొద్దిగా షాకిస్తూ ఆర్.ఆర్.ఆర్ ని థియేటర్లలో విడుదల చేసిన 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఫ్ఫాన్స్ కాస్త షాకయ్యారు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన 50 రోజుల్లో ఓటిటిలో విడుదలవుతుంది అనుకుంటే.. ఇలా 90 రోజులంటున్నారనేమిటి అని..