టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకే స్క్రీన్ మీద సందడి చెయ్యబోతున్నారు. టాప్ హీరోలైన్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ లో ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారు.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, వారి కేరెక్టర్స్ చూసిన ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్.. ఒకరిని తలదన్నేలా మరొకరు యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టేసారు. మరి ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజుల టైం ఉంది.. ఈలోపులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎన్ని వేదికలపై సందడి చేస్తారో అనేది తలచుకుంటేనే ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది.
నిన్న గురువారం ముంబై లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ మిస్ అవగా.. ఎన్టీఆర్ హాజరయ్యాడు. అదేరోజు హైదరాబాద్ లో జరగాల్సిన ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ కి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ హాజరవుతారనుకుంటే.. అక్కడ ఫాన్స్ వలన ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఈ హీరోలిద్దరూ కలిసి చెన్నై, బెంగుళూరు ఈవెంట్స్ కోసం కలిసి వెళ్లడం ఫాన్స్ ఖుషి అయ్యేలా చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కారు దగ్గర స్టయిల్ గా నిలబడి.. రాజమౌళి కొడుకు కార్తికేయ తో మాట్లాడుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్, ఎన్టీఆర్ ఆలా ఒకే ఫ్రేమ్ లో చూస్తే.. నిజంగా ఫాన్స్ కి బెస్ట్ పిక్ అవుతుంది. చెన్నై, బెంగుళూరు ఈవెంట్స్ కోసం వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్స్ చాలా రేర్ గా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి మూమెంట్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.