ఈ ఏడాది వరుడు కావలెను లాంటి సాలిడ్ హిట్ అందుకున్న నాగ శౌర్య బ్యాక్ టు బ్యాక్ అంటూ స్పోర్ట్స్ నేపథ్యంలో చేసిన లక్ష్య సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా లక్ష్య. హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తే.. కీలక పాత్రలో జగపతి బాబు నటించారు. స్పోర్ట్స్ బేస్‌డ్ డ్రామాగా లక్ష్య తెరకెక్కుతుంది అనగానే ఈ మూవీపై ముందుగా అంచనాలు పెద్దగా కలగలేదు.. కానీ పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అంచనాలను క్రియేట్ చెయ్యడలంలో టీం సక్సెస్ అయ్యింది. మంచి అంచనాలతో డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్ష్య సినిమా చూసిన ప్రేక్షకులు తమ టాక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సినిమా ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్ పంథాకు దూరంగా, కామెడీకి దూరంగా పూర్తిగా క్రీడా నేపథ్యంతో సాగిపోతుందట. కామెడీ ఆశించిన ప్రేక్షకులకి ఇది నిరాశనే కలిస్తుంది అంటున్నారు. ఇక సెకెండాఫ్ కి వెళితే.. అక్కడ కూడా కథలో సీరియస్ నెస్ డామినేట్ చేసింది అని, ఎంటర్టైన్మెంట్ ని పక్కనబెట్టారని, హీరో మళ్లీ గేమ్ మొదలు పెట్టి ఇండియాకు మెడల్ అందించడంతో సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుందట. ఈ సినిమాకి మెయిన్ హైలెట్స్ నాగ శౌర్య లుక్స్, సిక్స్ ప్యాక్ బాడీ, నాగశౌర్య పెరఫార్మెన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా.. ఏమాత్రం పరిచయం లేని ఆర్చరీ ఆట, ఆ ఆట నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు తేలిపోవడం, కామెడీ లేకపోవడం, కథని ఎమోషన్స్ డామినేట్ చెయ్యడం, కమర్షియల్ అంశాలకు చోటు లేకపోవడం వంటివి మైనస్ పాయింట్స్ గా చెబుతునాన్రు.. కొందరు మిక్స్డ్ టాక్ ఇస్తుంటే.. కొందరు లక్ష్య గురి తప్పింది.. అంటూ పెదవి విరుస్తున్నారు.