డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప సినిమా ప్రమోషన్స్ విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి టెక్నీక్ ఫాలో అవుతున్నాడో.. ఎందుకింతగా సైలెంట్ గా ఉన్నాడు.. పాన్ ఇండియా రిలీజ్ అంటే.. ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలో అనేది రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చూస్తుంటే అల్లు అర్జున్ ఫాన్స్ లో ఒణుకు వచ్చేస్తుంది.. రిలీజ్ కి పట్టుమని పది రోజుల టైం కూడా లేదు.. మరో వారంలోనే ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.. అలాంటప్పుడు పుష్ప ప్రమోషన్స్ విషయంలో టీం అగ్రెసివ్ గా ఉండాల్సింది పోయి.. బాలీవుడ్ ప్రమోషన్స్ విషయంలో నిమ్మకి నీరేత్తినట్టుగా ఉండడం ఫాన్స్ కి నచ్చడం లేదు. మలయాళం, కన్నడ, తమిళ్ లో అల్లు అర్జున్ క్రేజ్ తో అక్కడ ప్రమోషన్స్ చెయ్యకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం భీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే అక్కడి ప్రేక్షకులకి సినిమా రీచ్ అవుతుంది.
అల్లు అర్జున్ ఈ పన్నెండున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ పార్టీ నిర్వహిస్తున్నారు.. కానీ హిందీ ప్రమోషన్స్ విషయం చెప్పడం లేదు.. మరోపక్క నెల రోజుల తర్వాత రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ప్లాన్స్ ఫాన్స్ కి బాగా ఎక్కేస్తున్నాయి. ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నే ఒకేరోజు ముంబై, హైదరాబాద్ లో నిర్వహించి ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. ఇంకా బాలీవుడ్ లో అలియా భట్, అజయ్ దేవగణ్ ల క్రేజ్ ఉండనే ఉంది. పుష్ప కి ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే బాలీవుడ్ మొహాలేవీ పుష్ప లో నటించడం లేదు. మరి డిసెంబర్ 17 న రిలీజ్ అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి అనేది అన్ని తెలిసిన అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.