Advertisementt

బాస్ ప్రేక్షకులని వెర్రి 'పుష్పా'లని చేసారుగా

Fri 10th Dec 2021 09:48 AM
big boss,bigg boss telugu,siri,shanmukh  బాస్ ప్రేక్షకులని వెర్రి 'పుష్పా'లని చేసారుగా
Bigg Boss 5: Shanmukh fires on Siri బాస్ ప్రేక్షకులని వెర్రి 'పుష్పా'లని చేసారుగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ఇంకా షణ్ముఖ్ ల వ్యవహారం ముదిరి పాకాన పడింది.. లేదంటే బుల్లితెర ప్రేక్షకులని వెర్రి పుష్పాలని చేస్తున్నారో కానీ.. ఈమధ్యన అంటే బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారాల్లో వాళ్లిద్దరూ చేసే ఓవేరేక్షన్ చూడలేకపోయారు. సిరి తల్లి వచ్చి షణ్ముఖ్ ఇంకా సిరీలకి హగ్స్ విషయంలో గడ్డిపెట్టినా.. సిరి మాత్రం షణ్ముఖ్ హగ్ కోరుకుంటుంటే.. షణ్ముఖ్ మాత్రం సిరి మదర్ కి భయపడిఅంట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు. ఇక గత రెండు రోజులుగా వీరిద్దరూ పీక్స్ లో గొడవ పడడం.. అంతలో హగ్గులతో మళ్ళీ కలిసిపోవడం.. అబ్బో మాములుగా లేదు వీళ్ళ యవ్వారం.

షణ్ముఖ్ కి సిరి సన్నీ తో క్లోజ్ గా మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. సన్నీ గురించి సిరి మాట్లాడినా  ఒప్పుకోవడం లేదు.. నీవు నా ఫ్రెండ్ వి కాదు, నువ్వు అందరి హౌస్ మేట్స్ లాగే.. అబ్బో చాలా అతి చేస్తున్నాడు షణ్ముఖ్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్క్ లో సిరి జెనీలియాలా, షణ్ముఖ్ సూర్య, సన్నీ బాలయ్య లా, మానస్ పవన్ లా, శ్రీరామ్ చిరు, కాజల్ శ్రీదేవిలా యాక్ట్ చేసారు. సిరి - సన్నీ స్టేజ్ పై డాన్స్ చెయ్యగా.. చూసి తట్టుకోలేకపోయిన షణ్ముఖ్ సిరితో గొడవ పెట్టుకున్నాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో సిరి కి షణ్ముఖ్ మాటలతో హార్ట్ అయ్యిఅంట్లుగా కనబడింది. టాస్క్ చెయ్యను అనేసింది. మళ్ళీ వాష్ ఏరియా లో కూర్చుని సిరి - షణ్ముఖ్ లు మీటింగ్ పెట్టుకుని, కొంచెం గొడవపడి.. అంతలోనే కలిసిపోయి హాగ్ ఇచ్చేసుకున్నారు.. మానస్ వచ్చి సెట్టా అనగానే ఆ సెట్ అన్నారు.

మళ్ళీ ఫుడ్ వండేదగ్గర సిరి - షణ్ముఖ్ లు డిస్కర్షన్ పెట్టి.. సిరిని మరోసారి హార్ట్ చేసేసరికి.. మరోసారి సిరి అలిగినట్లుగా బిగ్ బాస్ చూపించారు.. వారు కొట్టుకోవడం తిట్టుకోవడం, నాగ్ చేత క్లాస్ పీకించుకోవడం, హగ్స్, ముద్దులు ఇవన్నీ చూపించి సిరి అండ్ షణ్ముఖ్ లు నిజంగానే బుల్లితెర ప్రేక్షకులని పిచ్చివాళ్ళని చేస్తున్నారు.

Bigg Boss 5: Shanmukh fires on Siri:

Bigg Boss Telugu 5: Shanmukh and Siri Overaction 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ