ఆర్.ఆర్.ఆర్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసన చెల్లెలి వివాహవేడుకల్లో పాల్గొంటున్నాడు. రెండు రోజుల క్రితమే దోమకొండ సంస్థానంలో ఉపాసన సిస్టర్ అనుష్పాల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.. రామ్ చరణ్ మరియు ఉపాసనలతో పాటుగా చిరు దంపతులు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. తాజాగా అంటే ఈ రోజు డిసెంబర్ 9 న ఉపాసన సిస్టర్ అనుష్పాల వెడ్డింగ్ రిసెప్షన్ ని ఆ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. దానితో రామ్ చరణ్ హైదరాబాద్ లోనే లాక్ అవడంతో.. ముంబై లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరవ్వలేకపోయాడు.
అయితే రామ్ చరణ్ - ఉపాసన లతో పాటుగా.. అనుష్పాల వెడ్డింగ్ రిసెప్షన్ లో కొంతమంది సెలబ్రిటీస్ మెరిశారు. అందులో ముఖ్యంగా సమంత కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఉపాసన ఫ్రెండ్ గా సమంత ఈ మధ్యన మెగా ఫ్యామిలీ దివాళి వేడుకల్లోనూ కలిసి సందడి చేసింది. తాజాగా ఉపాసన సిస్టర్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో శిల్పా చౌదరి, శ్రీయ శరన్ లతో పాటుగా సమంత కూడా ఎంజాయ్ చేసిన ఫొటోస్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. సమంత సారీ లో హాట్ గా నవ్వుతూ కనిపించినా.. మోహంలో ఏదో తెలియని బాధ మాత్రం ఇంకా ఇంకా కనబడుతూనే ఉంది. ప్రస్తుతం వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరైన సెలబ్రిటీస్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.