రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో బాహుబలిని మించి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్నప్పటి నుండి సినిమాపై ఎంతగా అంచనాలున్నాయో వాటిని ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఒక్కటే బీట్ చేసేసింది. రామ్ చరణ్ ఫాన్స్ కి ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూడగానే నోట మాట రాలేదు. జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ రచ్చ మొదలైపోయింది. అది ఇలాంటి అలాంటి రచ్చ కాదు.. భీభత్సమైన రచ్చ అన్నమాట. ఈ రోజు డిసెంబర్ 9న ముంబై లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించిన టీం.. సాయంత్రానికి హైదరాబాద్ లో ల్యాండ్ అవడమే.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సినీమాక్స్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ అంటూ మీడియా మిత్రులతో పాటుగా కొంతమంది ఫాన్స్ కి కూడా పాస్ లిచ్చారు.
ఈ ప్రెస్ మీట్ కి ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అంతా హాజరవుతున్నారంటూ ప్రకటించారు. అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ కి కేవలం టీం మాత్రమే కాదు.. ఫాన్స్ ని కూడా ఆహ్వానించేసరికి.. అక్కడికి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ లెక్కకు మించి హాజరవడంతో.. తొక్కిసలాట జరగడమే కాదు అక్కడ ఏర్పాటు చేసిన బ్యానెర్లు అన్ని తొక్కిపడేసారు. ఫాన్స్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇంత ఘటన జరిగింది. మరో నెల రోజల్లో విడుదల కాబోయే సినిమాపై క్రేజా.. లేదంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లని చూస్తున్నామనే ఆత్రంలో ఫాన్స్ భారీగా హాజరవడంతో.. అక్కడ అంటే ఈవెంట్ జరిగే చోట మాములుగా రచ్చ జరగలేదు.
దీనిని బట్టి సినిమా రిలీజ్ అయ్యేవరకు ఫాన్స్ ఆగలేకపోతున్నారా.. లేదంటే సినిమాపై నిజంగా ఇంత క్రేజ్ ఉన్నట్లుగా చూపిస్తున్నారా.. అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.