అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పుష్ప పాన్ ఇండియా మూవీ.. ఇప్పటివరకైతే.. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే పాన్ ఇండియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా విడుదలై పుష్ప ట్రైలర్ యూట్యూబ్ రికార్డులని వేటాడుతుంది. అల్లు అర్జున్ మాస్ స్టయిల్, సుకుమార్ టేకింగ్ అన్ని అద్భుతంగా సెట్ అవడంతో.. పుష్ప పై అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 17 న ఐదు భాషల్లో విడుదల కానున్న పుష్ప మూవీ ప్రమోషన్స్ ఇప్పటివరకు సోషల్ మీడియా ద్వారానే జరిగాయి. ఇంకెపుడు పుష్ప ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.. అందులో భాగంగా రేపు పది న సమంత - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన స్పెషల్ సాంగ్ ని వదలబోతున్నారు.
ఇక 12 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీ అంటూ పుష్ప మేకర్స్ ఆ ఫంక్షన్ పై అందరిలో ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. అయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ ఎవరిని తీసుకురాబోతున్నాడనే విషయంలో రకరకాల చర్చలు మొదలైపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక, స్పెషల్ సాంగ్ చేసిన సమంత, అలాగే టీం.. ఇంకా చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు రావొచ్చని ఊహాగానాలైతే ఉన్నాయి.. మరి చివరికి ఎవరు వస్తారో అనేది చూడాలి.