గత వారం రోజులుగా రోజు రోజు అంచనాలు పెంచుతూ.. ఫాన్స్ లో ఆత్రుత కలిగించిన ఆర్.ఆర్.ఆర్.ఆర్ నుండి ట్రైలర్ ని వదిలారు.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో వస్తున్న బడా మల్టీస్టారర్ అవడంతో.. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడడం అటుంచి.. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయేలా చేసారు. మరోపక్క ఆర్.ఆర్.ఆర్ మొదలైనప్పటినుండే రామ్ చరణ్ నిడివి ఎక్కువ, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ, కొమరం భీం ఎక్కువ, అల్లూరి కేరెక్టర్ ఎక్కువ.. రాజమౌళి ఎవరికీ ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు.. ఒక్క నిమిషం అటు ఇటు ఉన్నా.. ఇద్దరి ఫాన్స్ ని కంట్రోల్ చెయ్యడం కష్టమనే విషయం సినిమా మొదలైనప్పటినుండి వినిపిస్తున్నమాట.
మరి ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూడగానే.. అభిమానుల్లో ఉన్న అనుమానాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయనే చెప్పాలి.. ఆర్.ఆర్.ఆర్ లో ప్రతి షాట్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఎన్టీఆర్ ని మించి రామ్ చరణ్, చరణ్ ని మించి ఎన్టీఆర్ చెప్పాడు. లుక్స్ వైజ్ గాను ఇద్దరూ సూపర్బ్, పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తే.. విల్లంబులతో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ రెచ్చిపోయాడు. ఇద్దరూ ఫ్రెండ్లీ గా వేసుకునే సాంగ్, వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్.. అన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవనేలా ఉన్నాయి.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లోని హైలైట్స్ అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ కి ఇద్దరికీ సరిసమానమైన సంతోషాన్ని రాజమౌళి పంచేసారు. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ల నటన, ఎమోషన్స్ ఓ ప్రభనజనమే అనేలా ఉన్నాయి. ఇక ట్రైలర్ చూసాక.. ఫాన్స్ లో ఆర్.ఆర్.ఆర్ లో తమ స్టార్స్ మీదున్న భయాలు తొలిగిపోతాయనడంలో సందేహమే లేదు.