బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. ఇంకా పది రోజులు జర్నీ మాత్రమే ఉంది.. ఈ చివరి వారాల్లోనూ కంటెస్టెంట్స్ మధ్యన ఫైట్ లు జరుగుతూనే ఉన్నాయి. షణ్ముఖ్ చాలా ఓవర్ చేస్తూ సన్నీ మీదున్న కోపాన్ని సిరి మీద చూపించాడు. పదే పదే షణ్ముఖ్ సిరిని హార్ట్ చేసాడు.. సన్నీ తనని ఇమిటేట్ చెయ్యడం లైట్ తీసుకోలేకపోయిన షణ్ముఖ్ సిరి ఏదో చెప్పగానే ఆమె పై ఫైర్ అయ్యాడు. ఇది గత రాత్రి ఎపిసోడ్.. ఇక ఈ రెండు వారాల్లో ఉన్న ఆరుగురు మధ్యన స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది అనుకుంటే.. మరోసారి కాజల్ vs శ్రీరామ్ అన్నట్టుగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూపించారు.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలు పెట్టిన కొద్దివారాల నుండి కాజల్ కి శ్రీరామ చంద్ర కి మధ్యన అస్సలు పడ లేదు. టాస్క్ అయినా, ఏదైనా కాజల్ తో శ్రీరామ్ ఫైట్ కి రెడీగా ఉండేవాడు.. కాజల్ కూడా తగ్గేది కాదు.. ఇక ఈ రోజు ఎపిసోడ్ లోను కాజల్ కి శ్రీరామ్ కి పెద్ద ఫైట్ జరిగింది.. అది కాదు బ్రో అన్న కాజల్.. నేను బ్రో నా ఎప్పటికి కాను అన్నట్టుగా శ్రీరామ్ అనడాన్ని చూస్తే వారి మధ్యన ఎంత గొడవై ఉంటుందో కదా అంటున్నారు నెటిజెన్స్. ఇక ప్రోమో లో నేను మానస్ మాట్లాడుకుంటాము అంటున్నా.. అని శ్రీరామ్ అన్నాడు.. కాజల్ మధ్యలో హౌస్ కాల్ అన్నప్పుడు అనగానే, కాజల్ మధ్యలో నువ్వు మాట్లాడకు అన్నాడు శ్రీరామ్.
హౌస్ గురించి కాజల్ ఎలా మాట్లాడుతుంది అనగానే.. హౌస్ కాల్ ఎలాగూ మానస్ కే ఇస్తారు.. అది నాకిష్టం లేదు నేనే ఇస్తాను అని శ్రీరామ్ ని అంటుండగా.. సన్నీ నువ్ ఆగమ్మా మధ్యలోకి రాకు అని కాజల్ ని అన్నాడు. గేమ్ లో గెలవకుండా నువ్ మాట్లాడతావ్ చుడు అది నీపాయింట్ అన్నాడు కాజల్ ని శ్రీరామ్, కాజల్ ని శ్రీరామ్ ని మానస్ ఆపడానికి ట్రై చేసినా వాళ్ళు ఆగలేదు.. మానస్ నేను మాట్లాడుకుంటాం అంటే నువ్వెందుకు మొదలు పెట్టావ్ అన్నాడు శ్రీరామ్.. దానికి కాజల్ బ్రో అనగానే.. ఎవరు నీకు బ్రో పిచ్చ లైట్ తీసుకో అంటూ ఫైర్ అయిన ప్రోమో వైరల్ గా మారింది.