ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ కుమార్ భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన రాధేశ్యామ్ మూవీ జనవరి 14 న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. రాధేశ్యామ్ నుండి రిలీజ్ అవుతున్న సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆర్.ఆర్.ఆర్, పుష్ప మూవీస్ ట్రైలర్స్ హవా సోషల్ మీడియాలో నడవడంతో.. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ అంతా.. రాధేశ్యామ్ ట్రైలర్ డేట్ కూడా అనౌన్స్ చేస్తే బావుంటుంది..రోజుకో పోస్టర్ తోనో.. రోజుకో వీడియో తో ట్రెండ్ చెయ్యొచ్చుగా అంటూ యూవీ క్రియేషన్స్ కి రిక్వెస్ట్ లు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ విక్రమాదిత్యగా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కి ఎంతెలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ట్రైలర్ కి అంతకన్నా ఎక్కువగానే వస్తుంది అని ఫాన్స్ ఫీలయ్యేది, మరోపక్క ప్రేరణ గ్లిమ్ప్స్ అని అన్నా.. ఆ విషయంలో మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్, పుష్ప హవా చూసాక ప్రభాస్ ఫాన్స్ ఫీలవుతున్నారు. రాధేశ్యామ్ సాంగ్స్ మాత్రమే కాదు.. ట్రైలర్, ఇంకా టీజర్ లాంటివి రిలీజ్ చేస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.. లేదంటే అంటూ వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ ఫాన్స్ పుష్ప పై రెచ్చిపోయి ట్వీట్స్ వేస్తూ పుష్ప ట్రైలర్ ని ఓ రేంజ్ లో నించోబెట్టారు.. మరోపక్క రేపు రిలీజ్ అవ్వబొయె ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని ఎవరికీ అందనంత ఎత్తులో నించోబెట్టి రికార్డులు సృష్టించడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు.. అందుకే ప్రభాస్ ఫాన్స్ కూడా తొందర పడుతున్నారు. మరి ఫాన్స్ రిక్వెస్ట్ ని రాధేశ్యామ్ మేకర్స్ దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది..