అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో తెరకెక్కిన పుష్ప మూవీ డిసెంబర్ 17 న రిలీజ్ కి రెడీ అయ్యింది. అంటే మరో పది రోజుల్లో పుష్ప మూవీ రిలీజ్ కాబోతుంది. నిన్నటివరకు పుష్ప రిలీజ్ కి టైం సరిపోదు.. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే అన్నారు.. కానీ పుష్ప టీం.. సాంగ్స్ రిలీజ్ అలాగే ట్రైలర్ రిలీజ్ అంటూ హడావిడి మొదలు పెట్టడం, అలాగే మేకర్స్ తగ్గేదే లే అంటూ పదే పదే సినిమా రిలీజ్ విషయం క్లారిటీ ఇస్తూ వచ్చారు. అంతా బాగానే ఉంది.. కానీ పుష్ప సినిమా రిలీజ్ కి దగ్గర పడింది.. ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప కి ప్రమోషన్స్ సరిపోతాయా? హిందీలో సినిమా రిలీజ్ అంటే భారీ లెవల్లో ప్రమోట్ చెయ్యాలి.. లేదంటే ప్రభాస్ సాహో విషయంలో జరిగిందే జరుగుతుంది... సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతుంది. బాలీవుడ్ లో పక్కా పిఆర్ టీం ని మెయింటింగ్ చేసే అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప ప్రమోషన్స్ విషయంలో ఇలా సైలెంట్ గా ఎందుకున్నట్టు..
పాన్ ఇండియా మూవీ అంటే ఓ రేంజ్ ప్రమోషన్స్ ఉండాలి.. లేదంటే అన్ని భాషల ప్రేక్షకులకి రీచ్ అవదు.. అందులోని పుష్ప తో ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ లోకి అలాగే హిందీలోకి అడుగుపెట్టబోతున్న అల్లు అర్జున్.. ఆ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చూపెట్టాలి.. తెలుగు ఆడియన్స్ కోసం అఖండ రిలీజ్ ఈవెంట్ కి, ఢీ డాన్స్ షో తో బుల్లితెర మీద పుష్ప ని ప్రమోట్ చేసిన.. అల్లు అర్జున్ అక్కడ బాలీవుడ్ లో జరిగే పలు షోస్ కి వెళ్ళాలి, మొన్నీమధ్యన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో స్టేజ్ పైకి అల్లు అర్జున్ వెళ్లనున్నాడనే ప్రచారం జరిగినా క్లారిటీ లేదు..
ఇక హిందీలో ఓ ప్రెస్ మీట్ పెట్టాలి,. అలాగే తమిళ, కన్నడ, మలయాళం లోను పుష్ప ప్రెస్ మీట్స్ పెట్టాలి.. అక్కడ ప్రేక్షకులకి సినిమాపై ఆసక్తి పెంచాలి.. కానీ ఉన్న పది రోజుల్లో అనుకున్న ప్రమోషన్స్ సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.. మరోపక్క నెటిజెన్స్ పుష్ప కి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.