బిగ్ బాస్ సీజన్5 ఈ రోజు ఎపిసోడ్ లో షణ్ముఖ్ - సిరిల మధ్యన బాగా గొడవైంది.. బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్రెండ్స్ గా అడుగుపెట్టి ఫ్రెండ్ షిప్ పేరుతొ చెలరేగిపోయిన సిరి అండ్ షణ్ముఖ్ లు మధ్య మధ్యలో బిగ్ బాస్ కి బోలెడంత కంటెంట్ ఇచ్చేవారు. హగ్గులు ముద్దులే కాదు.. మధ్యలో ఇద్దరి గొడవలు పడి అతి ఓవేరేక్షన్ చేసేవారు.. షణ్ముఖ్ ఎప్పుడూ యాటిట్యూడ్ చూపిస్తూ సిరి ని హార్ట్ చేస్తుండేవాడు.. మధ్యలో సిరి ఒకసారి బాత్ రూమ్ డోర్ లాక్ చేసుకుని సీన్ కూడా చేసింది.. నాగార్జున గడ్డి పెట్టాడు ఇద్దరికీ.. సిరి మాత్రం ఎందుకో షణ్ముఖ్ తో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లుగా చెప్పి షాకిచ్చింది.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్ ని టాస్క్ లా చూడు అన్న సిరిపై షణ్ముఖ్ పదే పదే ఫైర్ అవుతున్నాడు. మధ్యలో సన్నీ అమ్మాయిలా మారిపోయి షణ్ముఖ్ తో రొమాంటిక్ గా దోసెలు వేయించుకుని తిన్నాడు. అలాగే శ్రీరామ్ చంద్ర ఆగరా బాబు అన్నా సన్నీ మాత్రం రెచ్చిపోయాడు.. మానస్ దగ్గర సన్ని అమ్మాయిల హొయలు పోతూ.. శ్రీరామ్ చూస్తున్నాడు అనగానే.. శ్రీరామ్ చూడకపోతే ఓకేనా అంటూ మానస్ ఆటపట్టించాడు.. సన్ని అమ్మాయిలా కామెడీ చెయ్యగా.. షణ్ముఖ్ మాత్రం తెగ అతి చేసాడు. తన కోపం తో సిరిని పదే పదే ఏడిపించేసాడు. నువ్వు ఎవరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే దాన్ని ఆపేద్దాం..
నిన్నెవడో అప్పడం అంటే నిన్ను నేను డిఫెండ్ చేశాను, మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్గు గురించి మాట్లాడింది. నేను నెగెటివ్ అవడం లేదు.. నెగెటివ్ గా ఆలోచిస్తున్నాను.. అవతలోడి ముందు నేను తక్కువైనా పర్లేదు.. ఫైట్ చెయ్యాలి. అప్పుడు నేను నెగెటివ్ అవ్వలేదు.. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ ఎలాగో.. నువ్వు అలాగే.. వెళ్ళు, నా నెత్తి మీద ఎక్కొద్దు అంటూ షణ్ముఖ్ సిరి పై జారీచేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.