Advertisementt

బిగ్ బాస్ 5: హౌస్ లో ఫన్నే ఫన్..!

Tue 07th Dec 2021 06:19 PM
bigg boss 5,bigg boss telugu,sunny,manas,shanmukh,siri,kajal,srirama chandra  బిగ్ బాస్ 5: హౌస్ లో ఫన్నే ఫన్..!
Bigg Boss 5: Full Fun With Housemates బిగ్ బాస్ 5: హౌస్ లో ఫన్నే ఫన్..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మరో పది రోజుల్లో ముగియబోతుంది. రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం అంటే.. డిసెంబర్ 19 న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం చేస్తుంది స్టార్ మా. ఇక హౌస్ లో ఎవరు ఏయే స్థానాల్లో ఉండాలి అనేది గత రాత్రి జరిగిన టాస్క్ లో చూసాం.. ఇక శ్రీరామ్ చంద్ర తప్ప మిగతా ఐదుగురు ఈ వారం డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్లారు.. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా ఐదుగురు గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారు. ఇక ఈ వారం టాస్క్ లకు ముగింపు నిచ్చి.. హౌస్ లో ఫన్ జనరేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. అందులో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన 19 మంది మెటాలిటీస్ ఎలా ఉంటాయో.. వారెలా బిహేవ్ చేస్తారో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చేసి చూపించాల్సి ఉంటుంది.

మానస్ పింకీ గా మారిపోతే.. సన్నీ మానస్ కింద, షణ్ముఖ్ కి సిరి లా శ్రీరామ చంద్ర సేవ చేస్తుంటే.. ఆహా ఎంత బావుంటుంది ఓ కిస్ పెట్టొచ్చు కదా అంటాడు షణ్ముఖ్.. దానితో చెయ్యి అడ్డుపెట్టి శ్రీరామ్ ముద్దు పెడతాడు.. అబ్బా కమిట్మెంట్ లేకపోతేనే అంటాడు. ఇక మానస్ అంటే సన్నీకి నడుం నొప్పి అనగానే మానస్ పింకీ వేషంలో వెళ్లి అతనికి సపర్యలు చేస్తాడు.. దానితో మానస్ లేచి పింకీ మీద అరిచినట్టుగా సన్నీ యాక్టింగ్ చేస్తాడు.. ఇక కాజల్, సిరిలు కూడా వేరే హౌస్ మేట్స్ లా మారిపోయి హౌస్ లో ఫన్ చూపించారు.. తర్వాత ప్రియాంక - మానస్ ప్రయాణం అనగానే సన్నీ ప్రియాంక లా మారిపోగా.. కాజల్ మానస్ లా మారిపోయింది. ​ఈ ఫన్ ఈరోజు ఎపిసోడ్ లో రాబోతుంది.

Bigg Boss 5: Full Fun With Housemates:

Bigg Boss 5 Telugu: Latest Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ