Advertisementt

భీమ్లా నాయక్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

Tue 07th Dec 2021 06:13 PM
bheemla nayak,pawan kalyan,rana,sagar k chandra,bheemla nayak sankranti blast  భీమ్లా నాయక్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ
Bheemla Nayak makers rubbish postponement rumours భీమ్లా నాయక్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ పై మార్కెట్ లోను, ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ, ఫాన్స్ లోనూ భీభత్సమైన క్రేజ్ ఉంది, భీమ్లా నాయక్ నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. రానా ఈగో పర్సన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతుంటే.. మొదటగా జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఆర్.ఆర్.ఆర్ జనవరి 7 న రిలీజ్ అనగానే భీమ్లా నాయక్ జనవరి 12 సంక్రాంతి రిలీజ్ పై అందరిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. 

దానితో మేకర్స్ మన భీమ్లా నాయక్ తగ్గేదే లే జనవరి 12 నే రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మధ్యలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం పవన్ తో మీటింగ్ పెడుతున్నాడనగానే.. మరోసారి భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ మేకర్స్ లైన్ లోకొచ్చి భీమ్లా నాయక్ రిలీజ్ పై ఫుల్ క్లారిటీ. తాజాగా బజ్ అంటూ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారుతుంది, సంక్రాంతికి భీమ్లా నాయక్ రావడం లేదనే న్యూస్ తో మేకర్స్ మరోసారి సోషల్ మీడియాలో పవన్ - రానా కాంబో భీమ్లా నాయక్ సంక్రాంతి కి జనవరి 12 నే రిలీజ్ ఎవ్వరికి భయపడేదే లే, తగ్గేదేలే అంటూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ఆత్రంతో మేకర్స్ కి ఎన్ని కష్టాలో అనేది భీమ్లా నాయక్ ఫాన్స్, మేకర్స్ ని చూస్తే అర్ధమవుతుంది.

Bheemla Nayak makers rubbish postponement rumours:

Bheemla Nayak confirms Sankranti blast

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ