Advertisementt

అఖండ విజయం పై మెగా కాంపౌండ్ మౌనం

Tue 07th Dec 2021 01:45 PM
mega heroes,megastar chiru,ram charan,allu arjun,varun tej,sai tej,akhanda movie,akhanda success  అఖండ విజయం పై మెగా కాంపౌండ్ మౌనం
Mega compound silence on Akhanda success అఖండ విజయం పై మెగా కాంపౌండ్ మౌనం
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి సద్దుమణిగినాక.. పెద్ద సినిమాలేవీ థియేటర్స్ లో రిలీజ్ కాలేదు.. దానితో డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమైన బాలకృష్ణ అఖండ వైపే అందరూ చూసారు.. భారీ అంచనాల నడుమ విడుదలైన అఖండ మూవీకి సినీ ప్రముఖులు ఆల్ ద బెస్ట్ చెప్పినట్టుగానే.. సినిమా ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. అటు నందమూరి ఫాన్స్ కి ఇటు ఇండస్ట్రీ ప్రముఖులకు అఖండ హిట్ ఊరటనిచ్చింది. దానితో అఖండ మూవీని వీక్షించిన చాలామంది స్టార్ హీరోలు బాలయ్య నట విశ్వరూపాన్ని, బోయపాటి దర్శకత్వాన్ని, థమన్ మ్యూజిక్ ని పొగుడుతూ ట్వీట్స్ చేసారు. అందులో మహేష్ బాబు, మోహన్ బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాని లాంటి హీరోలున్నారు. 

అయితే అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన అల్లు అర్జున్ కానీ, ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్, ఇంకా మెగా హీరోలెవరూ అఖండ విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన పాపం పోలేదు. ఒకపక్క ఏపీ లో సినిమా టికెట్స్ ఇష్యు నడుస్తుంది, మరోపక్క ఏపీలో వరదలు, ఇంకోపక్క కరోనా, ఇలాంటి సమయంలో విడుదలై అద్భుత విజయ సాధించిన అఖండ పై మెగా కాంపౌండ్ నుండి ఓ ట్వీట్ గనక పడినట్లయితే బావుండేది అంటూ నెటిజెన్స్ తో పాటుగా నందమూరి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి మెగాస్టార్ అయినా. బాలకృష్ణ కి ఆల్ ద బెస్ట్ అయినా, కంగ్రాట్స్ అయినా చెబితే బావుండేది. 

ఎందుకంటే మెగా హీరోల సినిమాలు వరసగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 17 న పుష్ప, 24 న వరుణ్ తేజ్ గని, జనవరి 7 న రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ ఫిబ్రవరి 4 న ఆచార్య మూవీస్.. రిలీజ్ అవ్వబోతున్నాయి. 

Mega compound silence on Akhanda success:

Mega Heroes silence on Akhanda success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ