Advertisementt

ప్రభాస్ రేంజ్ చూపించాడు

Tue 07th Dec 2021 01:01 PM
ap flood victims,prabhas,golden heart,andra pradesh,cm jagan  ప్రభాస్ రేంజ్ చూపించాడు
Prabhas donates a whopping amount for AP flood victims ప్రభాస్ రేంజ్ చూపించాడు
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా రేంజ్ పెంచుకున్నాడు. వరస పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా వున్న ప్రభాస్ సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. అందరూ పది, పాతిక, యాభై తో సరిపెడితే.. ప్రభాస్ మాత్రం కోటి రూపాయలిచ్చి తన రేంజ్ ఏమిటో చెప్పకనే చెప్పాడు. 

తాజాగా ప్రభాస్ కూడా ఏపీ ఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అనౌన్స్ చేసారు. ఈయన కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Prabhas donates a whopping amount for AP flood victims:

AP flood victims: Prabhas shows his golden heart

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ