మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలతోనే మెగాస్టార్ అవ్వలేదు.. ఆయన చేసే సహాయాలు, దానాలు, ఆయన మంచి గుణమే ఆయన్ని మెగాస్టార్ ని చేసాయి.. ఊరికే అవ్వరు మెగాస్టార్లు, మహానుభావులు అన్నట్టుగా.. మెగాస్టార్ సేవాగుణం గొప్పగా ఉంటుంది. కుడి చేతితో చేసిన ధనాన్ని ఎడమ చేతికి తెలియనివ్వని ఆయన సేవా గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే సోషల్ మీడియా ప్రాచుర్యం పొంది.. మెగాస్టార్ చేసే సేవలు, దానాలు వైరల్ అవుతున్నాయి కానీ.. ఒకప్పుడు చిరు నుండి సహాయం పొందినవారు చెబితేనే ఇలాంటి విషయాలు తెలిసేవి. కొన్నేళ్ల క్రితమే చిరు చారిటబుల్ ట్రస్ట్, చిరు బ్లడ్ బ్యాంక్, రీసెంట్ గా కరోనా మహమ్మారి నుండి కాపాడడానికి ఆక్సిజెన్ ప్లాంట్స్ ని నెలకొల్పారు.
ఇక తాజాగా సినిమాల్లో పని చేసే 24 క్రాఫ్తులని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరు మరో ముందడుగు వేశారు. అది మెగాస్టార్ యోదా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ ని రీసెంట్ గానే ప్రారంభించారు. ఈ యోదా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ ద్వారా కొన్ని వేలమందికి రక్త పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఎంతో విలువ చేసే బ్లడ్ టెస్ట్ లను ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ద్వారా 50% ఉచితంగా చెయ్యనున్నారు. కేవలం 24 క్రాఫ్ట్స్ కి మాత్రమే కాదు.. అర్హులైన సినీ జర్నలిస్ట్ లకి కూడా చిరు యోదా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఈ ఉచిత రక్త పరీక్షలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా జర్నలిస్ట్ కుటుంబాలకు ఈ టెస్ట్ లను వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు.. ఈ ఉచిత రక్త పరీక్షలని డిసెంబర్ చివరి వారంలో మొదలు పెట్టి.. కొత్త సంవత్సరం మొదట్లో పూర్తి చెయ్యాలనే సంకల్పంతో మెగాస్టార్ ఉన్నట్లుగా తెలుస్తుంది.