Advertisementt

నెల గ్యాప్ లో రెండు రిలీజ్ లు అంటున్న రవితేజ

Mon 06th Dec 2021 12:27 PM
mass maharaja ravi teja,sarath mandava,sudhakar cherukuri,ramarao on duty movie,raviteja,khiladi  నెల గ్యాప్ లో రెండు రిలీజ్ లు అంటున్న రవితేజ
Ravi Teja Ramarao On Duty Releasing On March 25 నెల గ్యాప్ లో రెండు రిలీజ్ లు అంటున్న రవితేజ
Advertisement
Ads by CJ

రవితేజ క్రాక్ హిట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో చాలా స్పీడు గా వున్నాడు. వరస సినిమాలతో రవితేజ జోరు గా నాలుగైదు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ అయ్యారు. రమేష్ వర్మ తో ఖిలాడీ మూవీ, శరత్ మండవ తో రామా రావు ఆన్ డ్యూటీ,  ఇంకా పాన్ ఇండియా మూవీ, అలాగే ధమాకా మూవీస్ తో బిజీగా వున్నాడు. రమేష్ వర్మ తో చేసిన ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ చెయ్యబోతున్న రవితేజ.. మల్లి నెల గ్యాప్ లో శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ ని మార్చి 25న విడుదల చెయ్యబోతున్నాడు.

మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25, 2022న ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్ర‌ముఖ న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Ravi Teja Ramarao On Duty Releasing On March 25:

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty Releasing On March 25, 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ