బాలకృష్ణ - బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కిన అఖండ మూవీ విడుదలైన మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. బాలయ్య నట విశ్వరూపాన్ని మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసుకుంటూ థియేటర్స్ బయటికి వస్తున్నారు.. థమన్ నేపధ్య సంగీతానికి ప్రేక్షకులు మైమర్చిపోతున్నారు. అఖండ విజయం మా విజయం కాదు.. ఇండస్ట్రీ విజయమంటూ బాలకృష్ణ చెప్పినట్టుగానే ఇప్పుడు మరో సీనియర్ నటుడు మోహన్ బాబు గారు.. అఖండ సినిమా సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది.. అంటూ ట్వీట్ చేసారు.
అఖండ విజయం పై మోహన్ బాబు స్పందిస్తూ..
సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన అఖండ సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది...
నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడికి, నిర్మాతకి మరియు సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు....
మంచి సినిమా ని అదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం మోహన్ బాబు అఖండ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.