ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తేనే కాదు.. ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనబడితే ఆయా హీరోల ఫాన్స్ కి పండగే. సినిమా ఈవెంట్స్ లో అయినా, ఏదైనా గేమ్ షో అయినా.. ఫాన్స్ పండగ చేసుకుంటారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి స్టార్టింగ్ ఎపిసోడ్ కి ఆర్.ఆర్.ఆర్ హీరో, ఎన్టీఆర్ ఫ్రెండ్ రామ్ చరణ్ గెస్ట్ గా వస్తే.. ఎవరు మీలో కోటీశ్వరులు ఎండింగ్ ఎపిసోడ్ అంటే సీజన్ ఎండ్ ఎపిసోడ్ కి మహేష్ బాబు వచ్చాడు. ఎన్టీఆర్ గేమ్ షో లో మహేష్ గెస్ట్ అనగానే ఆ ఎపిసోడ్ పై ఎప్పటినుండో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఆదివారం స్పెషల్ గా మహేష్ బాబు - ఎన్టీఆర్ కాంబో ఎపిసోడ్ ని జెమినీ ఛానల్ ప్రసారం చేసింది.
మహేష్ బాబుని ఇలాంటి గేమ్ షోస్ లో చాలా తక్కువ చూస్తుంటారు ఫాన్స్.. ఆయన సినిమాలేవో చేసుకుంటూ ఫ్యామిలీకి టైం కేటాయించే మహేష్ ఇప్పడు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో గేమ్ ఆడి ఏకంగా 25 లక్షల ప్రైజ్ మనీ గెలిచారు. ఇక ఎన్టీఆర్ ఆట.. మహేష్ బాబు వేట అన్నట్టుగా ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదంగా సాగింది. ప్రశ్నలు అడుగుతున్న ఎన్టీఆర్ ఓ ప్రశ్నని స్పోర్ట్స్ కి సంబంధించి అడిగాడు.. అన్నా మీరు ఆటలు ఆడతారా అంటే.. అప్పట్లో ఆడేవాడిని ఇప్పుడు ఆడడం లేదు.. క్రికెట్ ఆడేవారా అనగానే ఆడేవాడిని అన్నాడు మహేష్. అయితే.. నా టీం తో నేను, నీ టీం తో నువ్వు క్రికెట్ ఆడదాం అనగానే.. ఏ రబ్బర్ బాలో, ఏ టెన్నిస్ బాలుతోనో ఆడదాం.. క్రికెట్ బాల్ తో తో అంటే కష్టం అంటూ మహేష్ ఆట పట్టించాడు.
హా అయితే మీరు ఆడతారన్నా.. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేస్తున్నారుగా.. ఇకపై అన్ని ఆటలు ఆడతారు అంటూ ఎన్టీఆర్ మహేష్ బాబుని భయపెట్టాడు.. అంటే రాజమౌళి గారు ఏం ఆడిస్తారు అన్నాడు మహేష్ బాబు. నాకు ఎక్సపీరియెన్స్ ఉంది. రాజమౌళి గారితో సినిమా అంటే ఎలా ఉంటుందో.. ఇకపై నీకు కూడా తెలుస్తుంది అంటూ నవ్వగానే.. ఎందుకు అలా సర్క్యాస్టిక్ గా నవ్వుతున్నావ్ అన్నాడు మహేష్.. సో రాజమౌళి షూటింగ్ మధ్యలో ఎన్టీఆర్- రామ్ చరణ్ లతో వాలీ బాల్ లాంటి గేమ్స్ ఆడించినట్లుగా మహేష్ తో కూడా ఆయన గేమ్స్ ఆడిస్తాడని ఎన్టీఆర్ మహేష్ ని భయపెట్టేసాడు.