బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతుంది. ఈ వారం హౌస్ నుండి ప్రియాంక ఎలిమినేట్ అయితే.. మొత్తం 19 మంది హౌస్ లోకి ఎంటర్ అయిన హౌస్ నుండి ఇప్పటివరకు 13 మంది ఎలిమినేట్ అయినట్లు. ఇంకా హౌస్ లో 6 గురు హౌస్ మేట్స్ ఉంటారు. అందులో శ్రీరామ చంద్ర, షణ్ముఖ్, సన్నీ, మానస్, కాజల్, సిరి లు ఉన్నారు. అందులో ఒకరు బయటికి వెళ్ళిపోతే ఫైనల్ గా ఐదుగు టాప్ 5 లో ఉంటారు. ఇక ఈ వారం సండే ని నాగార్జున ఫన్ డే గా మార్చేశారు. ప్రియాంక కి మహానటి టాగ్ ఇవ్వగా.. వసీకర్ అంటే.. వేరేవాళ్ళ మీద పెత్తనం చేసేది.. షణ్ముఖ్ అంది సిరి. ఇక అర్జున్ రెడ్డి పేరుకి సన్నీ కరెక్ట్ గా సరిపోతాడంటూ హౌస్ మేట్స్ టాగ్స్ ఇచ్చేసారు.
మరో టాస్క్ లో నోట్లో నీళ్లు పోసుకుని మ్యూజిక్ ఇస్తే.. హౌస్ మేట్స్ వాటికి సమాధానం ఇవ్వాలి. అందులో ప్రియాంక, షణ్ముఖ్ లు నోట్లో నీళ్లు పోసుకుని కామెడీ చేసారు. ఇక మానస్ బ్లాక్ బస్టర్ అంటూ పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇవ్వగా.. షణ్ముఖ్ సమాధానం చెప్పి డాన్స్ చేసారు. ఇక పనిష్మెంట్స్ లో కాజల్ నేను ఈ పనిష్మెంట్స్ బాయ్స్ కి ఇవ్వాలని నాగ్ చెప్పగానే అందరూ అంటే.. కాజల్, ప్రియాంకలు సన్నీకి మేకప్ వేశారు. ఈ ఎపిసోడ్ అయ్యేవరకు ఐ లేనర్, లిప్ స్టిక్ తోనే ఉండాలని సన్నీకి చెప్పాడు నాగ్. ఇక ఇంట్లో సింపతీ కోసం ఎవరు ట్రై చేస్తున్నారనే మానస్ వెంటనే కాజల్ అన్నాడు.. దానికి నాగ్ కాజల్ ని ఇమిటేట్ చేసాడు.. నా వాళ్ళే నన్ను ఇలా అంటే ఎలా రా అంటూ కాజల్ ని చేసినట్టుగా నాగ్ ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు.