Advertisementt

ఆఖరికి నాగార్జున తో కూడా చెప్పించారు

Sun 05th Dec 2021 11:50 AM
bigg boss telugu,bigg boss,nagarjuna,shanmukh and siri hugs,siri,shanmukh  ఆఖరికి నాగార్జున తో కూడా చెప్పించారు
Nagarjuna Satires On Siri - Shanmukh Hugs ఆఖరికి నాగార్జున తో కూడా చెప్పించారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లో ఫ్రెండ్స్ గా చాలామంది ఉన్నారు.. ఇక హమీద - శ్రీరామ్ ల మధ్యన లవ్ ట్రాక్ ఉన్నట్టుగా చూపించారు. కానీ హమీదాని మధ్యలోనే ఎలిమినేట్ చెయ్యడంతో.. హౌస్ లో ఈసారి లవ్ బర్డ్స్ కింద ఎవరూ ప్రాజెక్ట్ కాలేదు.. కానీ ఫ్రెండ్స్ అంటూనే హగ్స్ తో కిస్సులతో రెచ్చిపోయి.. ఫ్రెండ్షిప్ కే మచ్చ తెచ్చేలా బిహేవ్ చేసిన షణ్ముఖ్ - సిరిల ని సిరి మదర్ కడిగిపారేసింది. సిరి - షణ్ముఖ్ ల హగ్స్ నచ్చలేదు అంటూ అందరి ముందు చెప్పింది.. సిరి ఎంతగా ఖండించినా ఆమె వినలేదు.. ఆ దెబ్బకి షణ్ముఖ్ బెదిరిపోయాడు.

సిరిని హగ్ చేసుకోవాలంటే సిరి మదర్ ఎక్కడ తిడతారో అని భయపడుతున్నాడు. సిరి ఏం కాదు అన్నప్పటికీ.. జస్ట్ ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ హగ్ ఇచ్చాక కెమెరాలతో చెప్పుకుంటున్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా సిరి - షణ్ముఖ్ ల హగ్స్ పై సెటైర్స్ వేశారు. ఆఖరికి షణ్ముఖ్ నాగార్జున తో సర్ సిరిని ఫ్రెండ్లీ గానే హగ్ చేసుకుంటున్నాను కానీ.. ఆమె మథర్ ఏం అనుకుంటున్నారో అనే భయం వేస్తుంది అనగానే.. నాగార్జున కూడా బిగ్ బాస్ స్టేజి పై నుండి సిరి - షణ్ముఖ్ ల హగ్స్ కేవలం ఫ్రెండ్ షిప్ హగ్స్ మాత్రమే అంటూ చెప్పడం చూస్తుంటే.. పదే పదే మాకు ఈ ఇరిటేషన్ ఏమిటి సర్ అంటున్నారు నెటిజెన్స్.>

Nagarjuna Satires On Siri - Shanmukh Hugs:

Bigg Boss Telugu 5: Nagarjuna Comments on Shanmukh and Siri Hugs 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ