బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటేనే మాస్ కాదు కాదు ఊరమాస్ అని ముచ్చటగా మూడోసారి అఖండ మూవీతో నిరూపించారు. బాలకృష్ణ హై ఓల్టేజ్ పెరఫార్మెన్స్.. థమన్ వాయించిన మ్యూజిక్, నేపధ్య సంగీతం అన్ని అఖండ సినిమాకి హైలెట్ అంటున్నారు ప్రేక్షకులు. బాలకృష్ణ అఘోర కేరెక్టర్ కి ఫాన్స్ కి థియేటర్స్ లో పూనకాలే అంటున్నారు. ఇక మొదటి రోజు బాక్సాఫీసుని ఊచ కోత కోసిన అఖండ మూవీ రెండో రోజు శుక్రవారం కూడా అఖండ బాక్సాఫీసు కళకళలాడింది. రెండో రోజు నైజాం, సీడెడ్ లలో అఖండ మంచి కలెక్షన్స్ సాధించింది.
అలాగే ఓవర్సీస్ విషయానికి వస్తే.. అఖండ సినిమాను ఓవర్సీస్ లో.. 2.5 కోట్ల రేటుకి అమ్మగా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఈ సినిమా 2.35 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ సినిమా రెండో రోజు అక్కడ 1.1 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది. మొత్తంగా ఓవర్సీస్ లో 2 రోజుల్లోనే 3.45 కోట్ల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకుని అక్కడ అప్పుడే అఖండ లాభాల వేటలో ఉందని అంటున్నారు.
ఏరియా డే2 కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 2.27
సీడెడ్ - 1.85
ఉత్తరాంధ్ర - 0.69
ఈస్ట్ గోదావరి - 0.45
వెస్ట్ గోదావరి - 0.34
గుంటూరు - 0.41
కృష్ణా - 0.44
నెల్లూరు - 0.24
ఏపీ-తెలంగాణ డే 2 కలెక్షన్స్ - 6.69 కోట్లు
ఏపీ- తెలంగాణ 2 రోజుల మొత్తం షేర్ - 21.28 కోట్లు