Advertisementt

అప్ డేట్: మహేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్

Sat 04th Dec 2021 12:49 PM
balayya,balakrishna,aha,ah video,unstoppable talk show,super star mahesh babu,balayya unstoppable with mahesh  అప్ డేట్: మహేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్
Update: Balayya Unstoppable with Mahesh అప్ డేట్: మహేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అల్లు అరవింద్ ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు. బాలకృష్ణ అల్లరి, బాలయ్య స్టయిల్, బాలయ్య ఎనర్జీ.. వచ్చే గెస్ట్ ల హడావుడితో నిజంగానే అన్ స్టాపబుల్ టాక్ షో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. రెండు ఎపిసోడ్స్ కే అన్ స్టాపబుల్ టాక్ షో పై అంచనాలు పెరిగిపోయాయి. మోహన్ బాబు తో అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య చేసిన రచ్చ ప్రేక్షకులకి బాగా ఎక్కేసింది. అలాగే నాని తో బాలయ్య చేసిన టాక్ షో అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. రీసెంట్ గా బ్రహ్మాండం తో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా లో స్ట్రీమింగ్ లో ఉంది. బ్రహ్మనందం, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో బాలకృష్ణ చిన్నపిల్లాడిలా మారిపోయి.. చేసిన కామెడీ, అల్లరి ఆ ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచాయి.

ఇక బ్రహ్మానందం తర్వాత విజయ్ దేవరకొండ అన్ స్టాపబుల్ కి గెస్ట్ అని అంటున్నారు. మరోపక్క మహేష్ బాబు బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చారని అన్నారు. అయితే మహేష్ బాబు, బాలయ్య అన్ స్టాపబుల్ కి గెస్ట్ గా రావడం నిజం.. ప్రస్తుతం బాలకృష్ణ - మహేష్ బాబుల ఎపిసోడ్ షూట్ కూడా జరుగుతుంది. ఈ రోజు అంటే శనివారం డిసెంబర్ 4 మహేష్ తో బాలయ్య బాబు అన్ స్టాపబుల్ గేమ్ షో షూట్ జరుగుతుంది.. ఇది తెలిసిన బాలయ్య ఫాన్స్, మహేష్ ఫాన్స్ ఖుషీగా పండగ చేసుకుంటున్నారు. మహేష్ తర్వాత ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, తర్వాత చిరు, రామ్ చరణ్ లు గెస్ట్ లుగా అన్ స్టాపబుల్ కి వస్తారని అంటున్నారు. 

Update: Balayya Unstoppable with Mahesh:

Superstar Mahesh to give unstoppable entertainment with NBK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ