Advertisementt

భార్యతో సినిమాకెళ్లాలంటే.. బాలకృష్ణ అలా చెయ్యాలి

Sat 04th Dec 2021 12:15 PM
balakrishna,aha ott,aha videos,unstoppable talk show,balayya wife vasundara  భార్యతో సినిమాకెళ్లాలంటే.. బాలకృష్ణ అలా చెయ్యాలి
Balayya Unstoppable Talk Show episode no 3 highlights భార్యతో సినిమాకెళ్లాలంటే.. బాలకృష్ణ అలా చెయ్యాలి
Advertisement
Ads by CJ

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్సాఫీసు ని చీల్చి చెండాడింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ కి పాజిటివ్ టాక్ పడడంతో.. నందమూరి ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. నటసింహ బాలకృష్ణ ఉగ్రరూపం అఘోరతో చూపించారు. అఖండ అలా ఉంటే.. అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు తో నాని తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ ఓ రేంజ్ సందడితో ఆహా ఓటిటికి మంచి కిక్ ఇచ్చాడు బాలయ్య. ఇంతవరకు ఏ టాక్ షోకి రాని మైలేజ్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి వచ్చేసింది అనే చెప్పాలి. ఇక అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కి కమెడియన్ బ్రహ్మానందం, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ లుగా వచ్చారు.

బాలయ్య, బ్రహ్మి కామెడీ ఆహా అన్ స్టేబుల్ స్టేజ్ పై అదిరిపోగా.. బాలకృష్ణ ని ఆయన భార్య ఒట్టు వేయించుకుని సినిమాకి తీసుకెళ్లిన విషయాన్ని రివీల్ చేసారు బాలయ్య. వేరె హీరోల సినిమాలకి వెళ్ళేటప్పుడు బాలకృష్ణ భార్య వసుంధర బాలయ్య తో ఒట్టు వేయించుకుంటారట. ఎదుకంటే.. బాలకృష్ణ కి సినిమా నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోతారట.. అలాగే పాటలు వచ్చేటప్పుడు ఓ కునుకు వేస్తారట. కానీ అలా సినిమా మధ్యలో లేచి వెళ్లిపోకుండా, సాంగ్స్ వచ్చినప్పుడు నిద్ర పోకుండా బాలయ్య వైఫ్ వసుంధర బాలయ్య తో ఒట్టు వేయించుకున్న విషయాన్ని బాలయ్య బ్రహ్మి తో అన్ స్టాపబుల్ స్టేజ్ పై రివీల్ చేసి నవ్వించేసారు. బ్రహ్మి భార్య లక్ష్మి గారు మిమ్మల్ని భరించడం, నా భార్య నన్ను ఎంతగా భరిస్తుందో అంటూ భార్యలని ఓ రేంజ్ లో పొగిడేశారు. ప్రస్తుతం బ్రహ్మి, అనిల్ రావిపూడి తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 3 ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

Balayya Unstoppable Talk Show episode no 3 highlights:

Balakrishna Unstoppable Talk Show episode no 3 highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ