బిగ్ బాస్ సీజన్ 5 టాప్ 5 లో ఎవరుంటారనే విషయంలో బయట బోలెడన్ని ఊహాగానాలు నడిచాయి. సన్నీ, శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, రవి, సిరి ఉంటారని అంటే.. రవి ఎలిమినేట్ అయ్యి షాకిచ్చాడు. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం టాప్ 5 కి వెళ్లే ఫస్ట్ కంటెస్టెంట్ కోసం టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఆ టాస్క్ లో మొదటి నుండి మానస్ ఫస్ట్ లో ఉన్నాడు. ఐస్ ట్యూబ్స్ లో కాళ్ళు పెట్టి సిరి, శ్రీరామ్ సిక్ అవడంతో వారి గేమ్ షణ్ముఖ్ అండ్ సన్నీ ఆడారు.. కొన్ని టాస్క్ లు శ్రీరామ్ చంద్ర ఆడాడు. అయితే చాలా టాస్క్ ల్లో మానస్ లీడింగ్ లోనే ఉన్నాడు. కానీ చిట్ట చివరి టాస్క్ లో మానస్- శ్రీరామ్ కి మధ్యలో పడిన టాస్క్ లో శ్రీరామ్ గెలిచాడు.
దానితో టాప్ 5 కి వెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీరామ్ నిలిచి టికెట్ టు ఫినాలే టాస్క్ సొంతం చేసుకున్నాడు. తన కోసం ఆడిన సన్నీకి షణ్ముఖ్ కి శ్రీరామ్ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాడు. అయితే కష్టపడి ఆడిన మానస్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుచుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకే పాపం మానస్ అనేది.. సూపర్ శ్రీరామ్ అన్నది. అసలు రేస్ లో లేని శ్రీరామ చంద్ర బిగ్ బాస్ సీజన్ 5 టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.