Advertisementt

బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా..

Fri 03rd Dec 2021 08:57 PM
kalyan ram,akhanda,balakrishna,akhanda movie,kalyan ram tweet  బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా..
Kalyan Ram says Balayya, Balayya.. Iragatisavayya .. బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా..
Advertisement
Ads by CJ

బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా... ఈమాటన్నది ఎవరో కాదు.. బాలకృష్ణ అన్న కొడుకు, హరికృష్ణ కొడుకు, ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో ఈ గురువారం రిలీజ్ అయిన అఖండ మూవీ పాజిటివ్ టాక్ తో.. సూపర్ హిట్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీసుని చీల్చి చెండాడింది. టాలీవుడ్ ప్రముఖులు అఖండ మూవీ చూసి అదిరిపోయింది అంటే.. నందమూరి వారసులు, టాప్ హీరోలు అఖండ ని ఎత్తేస్తున్నారు. అఖండ రిలీజ్ అయిన సాయంత్రానికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అఖండ మూవీ ని చూసేసి.. బాలా బాబాయ్ కంగ్రాట్స్, అఖండ చూసాను, అఖండ టీం కి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసాడు.

ఇక తాజాగా శుక్రవారం అఖండ మూవీ ని చూసిన నందమూరి కళ్యాణ్.. బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా... Enjoyed #Akhanda thoroughly. Babai in full force. Congratulations to the entire team for scoring a industry reviving blockbuster.. అంటూ బాలకృష్ణ పెరఫార్మెన్స్ ని తెగ మెచ్చేసుకుంటూ ట్వీట్ చేసాడు. అఖండ మూవీ హిట్ తోనే సంబరాలు చేసుకుంటున్న నందమూరి అభిమానులు.. ఇటు ఎన్టీఆర్ ట్వీట్, అటు కళ్యాణ్ రామ్ ట్వీట్ తో ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.

Kalyan Ram says Balayya, Balayya.. Iragatisavayya ..:

Kalyan Ram tweet on Balakrishna Akhanda movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ