Advertisementt

థియేటర్స్ క్లోజ్ చేసే ప్రసక్తే లేదు

Fri 03rd Dec 2021 08:25 PM
minister talasani srinivas yadav,cinema theaters,dil raju,rajamouli,chinababu,talasani  థియేటర్స్ క్లోజ్ చేసే ప్రసక్తే లేదు
Minister Talasani Gives Clarity On Movie Theaters థియేటర్స్ క్లోజ్ చేసే ప్రసక్తే లేదు
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు 50 పర్సెంట్ అక్యుపెన్సీతో మొదలైన.. తర్వాత 100 పెర్సెంట్ అక్యుపెన్సీతో.. థియేటర్స్ దగ్గర సినిమాల సందడి మొదలైపోయింది. జులై నుండి స్టిల్ అఖండ మూవీ వరకు ఎలాంటి భయాలు లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. కానీ మళ్ళీ కరోనా జాగ్రత్తలు మొదలైపోయాయి. మాస్క్ లేకపోతె తెలంగాణాలో 100 రూపాయల ఫైన్ వెయ్యడానికి టీఎస్ ప్రభుత్వం సిద్దమైంది.. ఇలాంటి సమయంలో థియేటర్స్ క్లోజ్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. 

ఇండస్ట్రీకి చెందిన దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్న బాబు), సునీల్ నారంగ్, DVV దానయ్య, రాధాకృష్ణ, RRR డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే అందిస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాల గోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన 2 సంవత్సరాల నుండి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందని అన్నారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. థియేటర్ ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, RRR, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని వివరించారు. కరోనా వల్ల సుమారు 2 సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, తెలియజేస్తూ టికెట్ ధరల పెంపుపై ఒక తుది నిర్ణయం తీసుకొని ధరలు పెంచి సినిమా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్ లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో FDC ED కిషోర్ బాబు తదితరులు కూడా పాల్గొన్నారు.

Minister Talasani Gives Clarity On Movie Theaters:

Minister Talasani Srinivas Yadav Gives Clarity On Cinema Theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ